Switch to English

విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రివ్యూ

Critic Rating
( 1.50 )
User Rating
( 1.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow
Movie లైగర్
Star Cast విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ
Director పూరీ జగన్నాథ్
Producer పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్
Music సునీల్ కశ్యప్
Run Time 2 గం 20 ని
Release 19 ఆగస్ట్ 2022

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా భారీ బజ్ మధ్య ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

కరీంనగర్ లో పుట్టి పెరిగిన లైగర్ (విజయ్ దేవరకొండ)ను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ చేయాలని కలలు కంటుంది అతని తల్లి బాలమణి (రమ్య కృష్ణ). ఇందులో కొడుకుని ముంబై తీసుకెళ్తుంది. అక్కడ లైగర్ కు తానియా (అనన్య పాండే) పరిచయమై తన గోల్ నుండి పక్కకు వెళ్తుంది దృష్టి. ఈ నేపథ్యంలో లైగర్ మళ్ళీ తన లక్ష్యంపై దృష్టి ఎలా పెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ఏం చేసాడు? అంతర్జాతీయంగా లైగర్ కు ఎదురైన సవాళ్లు ఏంటి అనేది సినిమా కథ.

నటీనటులు:

ఈ చిత్రం కోసం విజయ్ చేయాల్సిందంతా చేసాడు. తన ఫిజిక్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఒక బాక్సర్ ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ఇక నత్తి విషయం ప్రేక్షకులను కచ్చితంగా చిరాకు పెడుతుంది. మొదట్లో కొంచెం కొత్తగా అనిపించినా రాను రాను విసుగు తెప్పిస్తుంది. ఇక డ్యాన్స్ ల పరంగానూ విజయ్ కొత్తగా ట్రై చేసాడు కానీ ఇంకా ఫ్లెక్సిబిలిటీ రావాల్సి ఉంది.

అనన్య పాండే చిత్రానికి పెద్దగా ఉపయోగపడింది లేదు. సాధారణంగానే హీరోయిన్స్ ట్రాక్ ను పేలవంగా రాసే పూరి ఈసారి మరింత దిగజారుడు హీరోయిన్ పాత్రను రాయడం విశేషం. రమ్య కృష్ణ పాత్ర కూడా అంతే. మొదట్లో ఆసక్తికరంగా, పాజిటివ్ ఫీల్ తెప్పిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఆమె ఎందుకు అలా అరుస్తుందో ప్రేక్షకులకు అర్ధమే కాదు.

విషు రెడ్డి పర్వాలేదు. కోచ్ గా రోనిత్ రాయ్ డీసెంట్. గెటప్ శ్రీను నవ్వించడానికి ప్రయత్నించాడు.

సాంకేతిక వర్గం:

పూరి సినిమాలంటే స్టోరీ పెద్దగా ఆశించం. స్క్రీన్ ప్లే తోనే మ్యాజిక్ చేస్తాడు పూరి. గత చాలా ఏళ్లుగా ఫామ్ కోల్పోయి ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి ఫామ్ అందుకున్నట్లు కనిపించిన పూరి అది వన్ టైమ్ వండర్ మాత్రమేనని లైగర్ తో ప్రూవ్ చేసాడు. ఈ సినిమా కచ్చితంగా పూరి వీక్ వర్క్స్ లో ఒకటిగా నిలుస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. అవసరానికి మించి చాలా చోట్ల ఖర్చుపెట్టారు. అంత భారీ ఖర్చుతో మైక్ టైసన్ ను ఈ చిత్రంలోకి తీసుకురావడమెందుకో, దానివల్ల ఒరిగిందేంటో అర్ధం కాదు.

చాలా మంది సంగీత దర్శకులు కలిసి ఇచ్చిన పాటలు అంత ఇంప్రెసివ్ గా అనిపించవు. సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా సాగింది. ఎడిటింగ్ కు ఇంకా పని చెప్పొచ్చు అనిపించింది.

పాజిటివ్ పాయింట్స్:

  • విజయ్ దేవరకొండ
  • తల్లి-కొడుకు సన్నివేశాలు
  • రమ్యకృష్ణ

నెగటివ్ పాయింట్స్:

  •  స్క్రీన్ ప్లే
  • దర్శకత్వం
  • ఎంఎంఏ సన్నివేశాలు
  • పాటలు

చివరిగా:

లైగర్ పూరి కాంపౌండ్ నుండి వచ్చిన ఒక కాస్ట్లీ అటెంప్ట్. దాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసాడు పూరి జగన్నాథ్. భారీ ఖర్చు పెట్టి ప్యాన్ ఇండియా అంటూ హంగూ ఆర్భాటాలు చేసి కథ, స్క్రీన్ ప్లే వంటి బేసిక్ విషయాలను గాలికి వదిలేసాడు. విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ ను పక్కనపెడితే సోల్ లేని ఈ చిత్రాన్ని భరించడం కష్టమే.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1.5/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...