పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం
సూర్యోదయం: ఉ.5:32
సూర్యాస్తమయం: సా.6:37
తిథి: జ్యేష్ఠ బహుళ అమావాస్య పూర్తి
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: మృగశిర రా.6:30 వరకు తదుపరి ఆరుద్ర
యోగం: గండ ఉ.8:01 వరకు తదుపరి వృద్ధి
కరణం: చతుష్పాద సా.4:37
దుర్ముహూర్తం : ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి రా.10:46 నుండి 11:36 వరకు
వర్జ్యం : 3:49 నుండి 5:33 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి మ.10:30 వరకు
గుళికా కాలం : మ.12:19 నుండి 1:57 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:12 నుండి 5:00 వరకు
అమృతఘడియలు: ఉ.8:50 నుండి 10:35 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:53 నుండి మ.12:45 వరకు
ఈరోజు. (28-06-2022) రాశి ఫలితాలు
మేషం: పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
వృషభం: పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపుచేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.
మిథునం: సమాజంలో ఆదరణ పెరుగుతుంది. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.
కర్కాటకం: ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు.
సింహం: చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
కన్య: తండ్రి వైపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలు కలవు.
వృశ్చికం: కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. నూతన రుణాలు చేయవలసి రావచ్చు చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి.
ధనస్సు: ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఆలోచనలు కలసి వస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. నూతన వ్యాపారాలు లాభిస్తాయి.
మకరం: వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
కుంభం: రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి నూతన పెట్టుబడులు కలిసిరావు.
మీనం: ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.
913465 277355Glad to be one of several visitants on this awful site : D. 956457
482570 122007Id ought to seek advice from you here. Which is not something I do! I enjoy reading an write-up that could make individuals feel. Also, numerous thanks permitting me to comment! 26459