ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘నా వెంట్రుక కూడా పీకలేరు..’ అంటూ విపక్షాలను ఉద్దేశించి వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్న వేళ, ఇంకో వైపు వైఎస్సార్సీపీ పునాదుల్ని బద్దలుగొట్టేలా సొంత పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారు. ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది.?
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత, వైసీపీలో చాలా మార్పు కనిపిస్తోంది. చాలామంది పాత మంత్రులు, వైసీపీలో కనిపించడంలేదు. అప్పట్లో రెచ్చిపోయిన చాలామంది నాయకుల్లో, మెజార్టీ నేతలు ఇప్పుడు మీడియాకి మొహం చాటేస్తున్నారు. ఇంకొందరైతే, పార్టీలోని అంతర్గత కుమ్ములాటల గురించి బాహాటంగానే మాట్లాడుతున్నారు.
మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్ని గెలిచేయబోతున్నామని ఓ వైపు వైసీపీ చెబుతోంటే, అధినేత వైఎస్ జగన్ ఆ దిశగా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచాలనుకుంటోంటే, ఇంకోపక్క.. పార్టీని భూస్థాపితం చేసేందుకు వైసీపీ ముఖ్య నాయకులే కంకణం కట్టుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది.
సోషల్ మీడియా వేదికగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రదర్శిస్తున్న భ్రష్టత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకోపక్క, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం, దీంతోపాటుగా ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం వల్లో వైసీపీలో రేగుతోన్న చిచ్చు.. వెరసి, వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళుతోంటే, రోడ్లకు ఇరువైపులా పరదాలు కడుతున్నారు. దుకాణాల్ని తెరవనీయడంలేదు. కానీ, వైసీపీకి చెందిన ఇతర ప్రజా ప్రతినిథులు మాత్రం, గడప గడపకీ వెళ్ళి చీవాట్లు తినాలా.? అంటూ వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం.
వైసీపీ, టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్ మాట్లాడుతుండడం, వైసీపీ పరిస్థితిని మరింత దిగజార్చేస్తోంది. ఈ 60-40 డీల్ గురించి చాలాకాలంగా జనసేన తీవ్రమైన ఆరోపణలు చేస్తుండగా, ‘అది నిజమే’ అని వైసీపీ నేతలు చెబుతున్నారన్నమాట.
మొత్తంగా చూస్తే, వైసీపీ పతనం అత్యంత వేగంగా జరగబోతోందన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయ్.
230507 814753Is going to be back regularly in order to check up on new posts 539093