తెలుగు గొప్పా.? ఇంగ్లీషు గొప్పా.? అన్న చర్చ ఇంకోసారి షురూ అయ్యింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, విదేశీ పర్యటన సందర్భంగా, విదేశాల్లోని తెలుగువారు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘తెలుగు భాష చాలా గొప్పది..’ అని చెప్పారు. అంతేనా, ‘నేనూ తెలుగులోనే చదువుకున్నాను.. ఈ స్థాయికి వచ్చాను..’ అని కూడా అన్నారు. ‘ఇంగ్లీసులో చదువుకుంటేనే మంచి అవకాశాలు, తెలుగులో చదువుకుంటే సరైన అవకాశాలు వుండవన్నదాంట్లో వాస్తవం లేదు..’ అని కూడా సెలవిచ్చారు జస్టిస్ ఎన్వీ రమణ.
నిజమే, భాష అనేది కమ్యూనికేట్ చేయడం కోసమే. తెలుగు మీడియంలో చదువుకున్నా రెండూ.. రెండూ కలిపితే నాలుగే. ఇంగ్లీషులో చదువుకున్నా టూ ప్లస్ టూ అంటే ఫోర్ అవుతుందంతే. నిజమే, ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఇంగ్లీషులో కమ్యూనికేట్ చేయడం తేలిక. కానీ, కొన్ని దేశాల్లో ఇంగ్లీషుకి వున్న ప్రాధాన్యత చాలా చాలా తక్కువ.
తెలుగు మీడియంలో చదువుకుంటే, ఇంగ్లీషు రాదన్నది కేవలం మూర్ఖత్వం మాత్రమే. ఇంగ్లీషులో మాట్లాడగలిగితే, వాళ్ళు మేధావులైపోతారనడం అంతకన్నా మూర్ఖత్వం. తెలుగు మీడియంలో చదువుకుని, ఇంగ్లీషు భాషలో రాణించినవారెందరో మనకి కనిపిస్తారు. ఇంగ్లీషు భాషలో.. అదీ అమెరికన్ యాక్సెంట్‌లో విద్యార్థులతో మాట్లాడించేసి, ‘మేం రాష్ట్రాన్ని ఉద్ధరించేశాం.. విద్యా వ్యవస్థను బాగు చేసేశాం..’ అని వైసీపీ సర్కారు చెప్పుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
పదో తరగతి పరీక్షల ఫలితాలు, ఇంటర్మీడిట్ పరీక్షా ఫలితాలు.. రాష్ట్రంలో విద్యారంగం, విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. అమ్మ ఒడి, నాడి నేడు, జగనన్న విద్యాదీవెన.. ఇలాంటి పథకాలతో విద్యారంగానికి ఎంత మేలు జరుగుతోందన్నది ఆయా పరీక్షల ఫలితాలతోనే అర్థమయిపోతోంది కదా.?
అయినాగానీ, ముఖ్యమంత్రి పాల్గొనే అధికారిక బహిరంగ సభల్లో విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడించేసి, తమ ‘ఎంగిలిపీసు’ వాదనే కరెక్టనే భావనలో అధికార పార్టీ వుండడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
దెబ్బ తగిలితే, ‘అమ్మా’ అనే తెలుగు భావనకీ, ‘షిట్’ అంటూ ఎంగిలిపీసులో ఏడవడానికీ ఎంత తేడా వుంటుంది.?
200957 415916I like this internet site really considerably so considerably superb information . 765507
554408 849093Would adore to perpetually get updated great blog ! . 438160
291443 316944I like this site very much so significantly excellent info. 578530