Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 27 నవంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,163FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం

సూర్యోదయం: ఉ.6:15
సూర్యాస్తమయం: సా.5:20 ని.లకు
తిథి: కార్తీక శుద్ధ పౌర్ణమి మ.2:10 ని.వరకు తదుపరి కార్తీక బహుళ పాడ్యమి
సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం)
నక్షత్రము: కృత్తిక మ. 1:49 ని.వరకు తదుపరి రోహిణి
యోగం: శివం రా.12:35 ని. వరకు తదుపరి సిద్ధం
కరణం: బవ మ.2:10ని. వరకు తదుపరి కౌలవ
దుర్ముహూర్తం : మ.12:09 నుండి 12:54 ని. వరకు తదుపరి మ.2:23 నుండి 3:07 ని . వరకు
వర్జ్యం : రా. తె.3:35 నుండి 5:51 ని.వరకు
రాహుకాలం: ఉ.7:30 ని. నుండి 9:00 గం.వరకు
యమగండం: ఉ.10:30 ని నుండి మ. 12:00 గం .వరకు
గుళికా కాలం: మ.1:26 ని నుండి 2:49 ని.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:55 ని.నుండి 5:43 ని.వరకు
అమృతఘడియలు: ఉ.11:27 నుండి మ.1:01 ని‌ వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:41 నుండి మ.12:25 వరకు

ఈరోజు (27-11-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన పనులను ప్రారంభిస్తారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కీలక వ్యవహారాలు చర్చించి మీ విలువను మరింత పెంచుకుంటారు.

వృషభం: కొన్ని వ్యవహారాలలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

మిధునం: సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం: దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. స్థిరాస్తి వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

సింహం: కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

కన్య: దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. నూతన రుణ యత్నాలు చిన్నపాటి ప్రయత్నం మీద పూర్తిఅవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

తుల: సమాజంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికీ విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

వృశ్చికం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.

ధనస్సు: సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు స్వల్ప సమస్యలు తప్పవు.

మకరం: చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

కుంభం: నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మీనం: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

సినిమా

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు...

రాజకీయం

మూడు నెలల్లో 3,371 అధ్యాపక పోస్టులు భర్తీ: నారా లోకేష్

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం...

ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహకు శుభవార్త – వృషభకు ఆర్థిక లాభం సూచనలు

మార్చి 2, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి చర్చలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త...

మార్ఫింగ్ వీడియోలు ఫేక్… 30 ఏళ్ల పరిచయాన్ని వక్రీకరించారు: బి. ఆర్. నాయుడు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై  టీటీడీ ఛైర్మన్   బి. ఆర్. నాయుడు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబానికి ఆ కుటుంబంతో గత 30 ఏళ్లుగా స్నేహపూర్వక పరిచయాలు...

దాడులు ఒకవైపు… చర్చల సంకేతాలు మరోవైపు… మధ్యప్రాచ్యం ఉత్కంఠ

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇది అధికారికంగా ప్రకటించిన ప్రపంచ యుద్ధం కాదు. కానీ Israel – Iran మధ్య ప్రత్యక్ష సైనిక దాడులు, అలాగే United States ఇజ్రాయెల్‌కు అందిస్తున్న...

విరోష్ సేవా సందేశం: దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞతగా విరోష్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ నటి రష్మిక  మందన్న జంట తమ వివాహం...

అడవిలో 10 కిలోమీటర్లు నడిచే పిల్లలకు రోడ్డు: అసలు విషయం ఇది!

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపతి పంచాయతీ పరిధిలోని రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజన చిన్నారులు ప్రతిరోజూ అడవుల మధ్యగా సుమారు 10 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నారు. సరైన రహదారి సౌకర్యం...