Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 03 సెప్టెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణం

సూర్యోదయం: ఉ.5:49
సూర్యాస్తమయం: రా.6:11 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ చవితి రా.11:17 ని.వరకు తదుపరి శ్రావణ బహుళ పంచమి
సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం)
నక్షత్రము: రేవతి సా.4:08 ని.వరకు తదుపరి అశ్వని
యోగం: గండ రా.12:04 ని. వరకు తదుపరి వృద్ధి
కరణం: బవ మ.12:13 ని. వరకు తదుపరి కౌలవ
దుర్ముహూర్తం: సా.4:32 నుండి 5:21 ని.వరకు
వర్జ్యం : సూర్యోదయం నుండి ఉ.6:15 ని‌. వరకు
రాహుకాలం: సా.4:30 గం. నుండి 6:00 ని.వరకు
యమగండం: మ.12:00 ని‌ నుండి 1:30 గం .వరకు
గుళికా కాలం: మ.3:20 నుండి సా.4:52 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:30 ని.నుండి 5:18 ని.వరకు
అమృతఘడియలు: మ.1:51 ని. నుండి మ.3:22 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:50 నుండి 12:40 వరకు

ఈరోజు (03-09-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.

వృషభం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

మిథునం: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

సింహం: ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

కన్య: దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.మిత్రుల నుంచి అవసరానికి ధనసహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

తుల: కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృశ్చికం: బంధు, మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు.

ధనస్సు: బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ధన పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మకరం: ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం: ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగముల అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...