Switch to English

కరోనా ఎఫెక్ట్: ముస్లీమ్ సోదరుల రంజాన్ సెలబ్రేషన్స్ లో వచ్చిన మార్పులు.!

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్‌ తో బతుకుతుంది. ఈ సమయంలో ఒక పండుగ లేదు ఒక వేడుక లేదు. సాదారణంగా అయితే ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ముస్లీంలు రంజాన్‌ సంబరాల్లో మునిగి తేలాల్సి ఉంటుంది. కాని ఈసారి మాత్రం పరిస్థితి మరోలా ఉంది. కరోనా కారణంగా ఎక్కడ చూసినా కూడా మృతుల సంఖ్య వందలు వేలల్లో ఉంది. కనుక ఈ పవిత్ర మాసంలో కూడా ముస్లీంలు ఇంటికే పరిమితం అవుతున్నారు.

మామూలుగా అయితే ఈ సమయంలో ఖచ్చితంగా రోజులో కనీసం రెండు లేదా మూడు సార్లు మసీదుకు వెళ్లి నమాజ్‌ చేసేవారు. కాని ఈసారి మాత్రం పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఒకరికి ఒకరు సలామాలేకుమ్‌ అంటూ ఆలింగనం చేసుకుని మరీ శుభాకాంక్షలు చెప్పుకునేవారు. కాని ఇప్పుడు పూర్తిగా సామాజిక దూరం పాటిస్తూ ఉన్నారు.

ముస్లీంలు ఈసారి అన్ని విషయాల్లో కూడా మార్పులు చూస్తున్నారు. ఉపవాసం నుండి మొదలుకుని ప్రార్థనల వరకు అన్ని విషయాల్లో కూడా కరోనా ప్రభావం చూపిస్తుంది. మసీదుకు వెళ్లాలి అంటూ ప్రార్థన మందిరాలను నిషేదించారు. ఉపవాసం విరమించి సాయంత్రం సమయంలో హలీమ్‌ తినాలంటే ఎక్కడ కూడా హలీమ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.

ఇక కొత్త డ్రస్సులు, కొత్త వస్తువులు ఏమీ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కోటీశ్వరుడి నుండి మొదలుకుని అడుక్కునే వాళ్ల వరకు కూడా ముస్లీంలు రంజాన్‌కు ఖచ్చితంగా కొత్త డ్రస్‌లు తీసుకుంటారు. వారి జీవన విధానంలో రంజాన్‌ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. కాని ఈసారి మాత్రం రంజాన్‌ వారికి నిరాశను మిగిల్చింది. ఈ రంజాన్‌ వారి జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.

ఉపవాసాల సమయంలో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇఫ్తార్‌ వింధు తెగ వినిపించేది. కాని ఇప్పుడు ఎక్కడ కూడా ఇఫ్తార్‌ వింధులు కనిపించడం లేదు. ఎవరి ఇంటో వారే వింధులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కలిసినా పది లేదా ఇరువై మంది మాత్రమే కలుస్తున్నారు. వారు కూడా సామాజిక దూరం పాటిస్తూ వింధును ఆరగిస్తున్నారు.

కొన్ని దేశాల్లో ముస్లీం ప్రార్థన మందిరాలోలకి అనుమతిస్తున్నారు. కాని ఎక్కువ దేశాల్లో మాత్రం ముస్లీంలు పూర్తిగా ఇంటి వద్దే నవాజ్‌ చదువుకుంటున్నారు. డబ్బున్న ముస్లీంలు పేద ముస్లీంలకు ధన, వస్తు సాయం చేస్తూ ఉండేవారు. కాని ఈసారి ఎక్కడ సాయం చేయాలి, ఎలా చేయాలో తెలియని పరిస్థితి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా చితికి పోయే ఉన్నారు. కనుక ఒకరికి ఒకరు సాయం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.

మొత్తానికి ఈ సారి రంజాన్‌ పండుగతో ముస్లీంలు చాలా మార్పు వచ్చింది. మరో నాలుగు రోజుల్లో రాబోతున్న పండుగ కూడా ఇలాగే సింపుల్‌గా ఎవరి ఇంటో వాళ్లే జరుపుకుని కరోనా నుండి దూరంగా ఉండటం మంచిదని ముస్లీం మత పెద్దలు అంటున్నారు.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ భారీ...

తెలుగు జాతి గర్వపడేలా చేసిన మల్లీశ్వరి బయోపిక్ ప్రకటన

గత కొంత కాలంగా కరణం మల్లీశ్వరి బయోపిక్ గురించి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇండియా తరుపున ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న తొలి మహిళగా కరణం మల్లీశ్వరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది....

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. తనపై వచ్చే...

శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం..

తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు. జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి....

బన్నిలా నన్ను తప్ప వేరొకరిని ఊహించుకోలేనంటున్న బాలీవుడ్ హీరో.!

అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని...