దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 14 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,06064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే 27వేల కేసులు తగ్గినా.. మూడు లక్షల మార్కు దాటాయి. కర్ణాటకలో 50వేల మార్కు కేసులు దాటాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 439 మంది మృతి చెందారు. మొత్తంగా రెండేళ్లలో 4,89,848 మంది మృతి చెందారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది.
నిన్న కరోనా నుంచి 2,43,495 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 22 లక్షలకు పైగా ఉన్నాయి. నిన్న కోవిడ్ టీకాను 27 లక్షల మంది తీసుకున్నారు. ఆదివారం కావడంతో టీకాలు వేయించుకునే వారి సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ 162 కోట్ల మందికి కరోనా టీకాలు అందాయి. ప్రస్తుతం 15-18 ఏళ్ల వయసు వారికి మొదటి డోసు, 60 ఏళ్ల పైబడిన వారిక ప్రికాషన్ డోసులు వేస్తున్నారు.