Switch to English

కరోనా అలర్ట్‌: పెను ఆర్థిక ముప్పు ముంచుకొచ్చేస్తోంది

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కారణంగా ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. అయితే, కరోనా వైరస్‌ కంటే పెను ముప్పు ముంగిట ప్రపంచం బిక్కుబిక్కుమంటోందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందుతోన్న దేశాలే కాదు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ముందు ముందు అభివృద్ధికి దూరమైపోయిన చాలా దేశాల తరహాలో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నాయని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

ఏ దేశానికి ఆ దేశమే కనీ వినీ ఎరుగని స్థాయిలో ఆర్థిక ఉత్పాతాన్ని చవిచూడాల్సి వస్తుందన్నది ఆర్థిక రంగ నిపుణుల హెచ్చరిక. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ‘అన్నమో రామచంద్రా..’ అని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆకలి కేకలు విన్పించబోతున్నాయట. మరీ, అంతటి దయనీయమైన పరిస్థితులుంటాయా.? అదీ రెండు నెలల సంక్షభానికేనా.? అని కొందరు ప్రశ్నించొచ్చుగాక. ఇప్పుడు చూస్తోన్న కరోనా ప్రభావం చాలా తక్కువేననీ.. రానున్న రోజుల్లో అసలు ముప్పుని మానవాళి ఎదుర్కోవాల్సి వుంటుందన్నది ఆయా రంగాల నిపుణులు చెబుతున్న మాట.

‘కరోనా వైరస్‌ విషయంలో ఆలస్యంగా స్పందించడమే కాదు, అతిగా కూడా స్పందించాం.. అదే ఈ దుస్థితికి కారణం’ అన్నది ఆర్థిక రంగ నిపుణుల వాదన. మన దేశం విషయానికొస్తే, లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని చాలా ముందుగా తీసుకుని వుండాల్సిందనీ.. కొద్ది రోజుల ఆలస్యం.. దేశానికి పెను నష్టాన్ని మిగిల్చిందనీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశంలోకి ఒక్క కరోనా పేషెంట్‌ కూడా రాకుండా చేయగలిగి వుంటే, అసలు లాక్‌డౌన్‌ అవసరమే వచ్చేది కాదన్నది వారి వాదన. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక కూడా లక్ష కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం చిన్న విషయం కాదనీ, లాక్‌డౌన్‌ వెసులుబాట్లు ఇవ్వడమంటే మరింతగా జనాన్ని కరోనా కోరల్లోకి నెట్టేయడమేనని మేధావి వర్గం ఆరోపిస్తోంది. ‘ఆలస్యంగా స్పందించాం.. తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం..’ అని నిర్మొహమాటంగా మేధావి వర్గమే కాదు, సామాన్యులూ అభిప్రాయపడ్తున్నారు.

ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఆయా దేశాలు తమ పౌరుల్ని ఇతర దేశాల నుంచి రప్పిస్తున్న దరిమిలా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరింత విస్తరించనుందన్నది నిర్వివాదాంశం. కరోనా వైరస్‌కి అత్యంత వేగంగా వ్యాక్సిన్‌ కనుగొనగలిగితే మాత్రం.. ఈ విపత్తు నుంచి తప్పించుకోవచ్చు. కానీ, అదెప్పుడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈలోగా ప్రపంచ మానవాళికి జరగాల్సిన నష్టం జరిగిపోతూనే వుంటుంది.

సినిమా

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...

రంజాన్‌ స్పెషల్‌: ‘హలీం’కి ఊరట దక్కేనా.?

హలీం.. రంజాన్‌ స్పెషల్‌ వంటకం ఇది. కేవలం ముస్లింలకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చెందిన భోజన ప్రియుల్నీ తనవైపుకు తిప్పుకున్న ప్రత్యేక వంటకంగా హలీం గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడో విదేశాల్లో పుట్టి,...

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...

క్రైమ్ న్యూస్: గొడవలతో భార్య భర్తల ఆత్మహత్య, 9 నెలల చిన్నారిని కూడా..!

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. డోర్నకల్‌ మండలం మన్నెగూడెంకు చెందిన రాంబాబు మరియు ఆయన భార్య కృష్ణవేణిలు ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు 9 నెలల చిన్నారిని కూడా వారు చంపేశారు. ఈ...