Chiranjeevi: ‘సినిమాల్లో నటిస్తూనే ఉంటా.. డ్యాన్సులు, ఫైట్లు చేస్తా.. మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా.. ఆ భగవంతుడు నాకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా. నా అభిమానులు ధియేటర్ల దగ్గర సందడికి కాదు.. వారిని సేవా మార్గం వైపు నడింపించాలని భావించాను. నేను చేసే సేవా కార్యక్రమాలు ఇంత విస్తృతంగా ప్రజలకు చేరడానికి కారణం వారే’నిని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘కళాకారులు గౌరవింపబడిన చోట.. సన్మానించబడిన చోట ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే పెద్దల మాట నిజమనిపిస్తోంది. ఇంతమంది కళాకారులకు సన్మానం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గారికి ధన్యవాదాలు. పద్మభూషణ్ వచ్చినప్పుడూ.. పద్మ విభూషణ్ వచ్చినందకూ చాలా సంతోషంగా ఉంది. కానీ.. వారం రోజులుగా ఎందరో ప్రముఖులు, సినీ పరిశ్రమ వర్గాలు వచ్చి నన్ను అభినందిస్తుంటే ఆ సంతోషం మరింత ఆనందంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలం.. మా తల్లిదండ్రుల కడుపున పుట్టడం అనిపిస్తుంద’ని అన్నారు.