వెండితెర రారాజులా.. మెగా మహారాజులా.. ‘స్వయంకృషి’కి చిరునామాలా.. అభిమానుల ‘విజేత’గా.. అన్నార్తులకు అపద్బాంధవుడుగా.. అభిమానులకు అన్నయ్యగా.. అనుభవంలో మాస్టర్‌గా.. హోల్ ఇండస్ట్రీకి మెగాస్టార్‌గా ఎదిగిన నిలువెత్తు సినీ శిఖరం చిరంజీవిని భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. అత్యున్నత గౌరవం అందుకున్న చిరంజీవికి అదే స్థాయిలో శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ఎన్నారైలు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినీ లైఫ్ జర్నీ వీడియోను ప్రదర్శించారు. ఈ అరుదైన సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. మెగా అభిమాని, తెలుగు ఎన్నారై రాజ్ అల్లాడ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైల సంఘాల ప్రతినిధులు పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు అందించారు. తమ అభిమాన హీరో చిరంజీవి భవిష్యత్‌లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకోవాలని ఆకాంక్షించారు.
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినిమాల్లోని దృశ్యాలను ప్రదర్శించారు. ఆ సమయంలో ”స్టార్.. స్టార్.. మెగాస్టార్..” అంటూ ఆ ప్రాంగణమంతా అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. ఇక ప్రజాసేవ కేటగిరిలో పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడుకు కూడా తెలుగు ఎన్నారైలు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ఎన్నారైల తెలుగు సంఘాలు NATS, MATA, Atmiya, AptA, TANA, NATA, AAA, NRIVA, TTA, NASAA, TFAS, ISANA సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా గ్రూప్ లీడర్స్.. ఓం ప్రకాశ్ నక్కా, విజయ్ రామిశెట్టి, బుల్లి కనకాల, గోపికృష్ణ గుర్రం, ఆనంద్ చిక్కాల, వెంకట్ నాగిరెడ్డి, లక్ష్మణ్ నాయుడు, అనిల్ కుమార్ వీరిశెట్టి, వంశీ కొప్పురావూరి తమ సహాయ సహకారాలు అందించారంటూ వారికి రాజ్ అల్లాడ కృతజ్ఞతలు తెలిపారు.