Switch to English

చంద్రబోస్‌కు ఘన సత్కారం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని ఘనంగా సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు శ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో I FLY STATION ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక లో కార్యక్రమం జరిగింది. చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ , ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి దీపు పి విఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరు అయ్యారు. వారిలో మురళీ మోహన్ , సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి, జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం అంటూ.. తన అన్నయ్యను వేదికపై పరిచయం చేశారు. తనను అన్నయ్య ఎంతో ప్రోత్సహించాడని గుర్తు చేసుకున్నారు. ఇక తన మిత్రులకు కూడా ధన్యవాదాలు అని చెప్పాడు. ప్రదీప్ గారు మీ రుణం నేను తీర్చుకోవాలి. మీకు సరస్వతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వేదికపై ఎన్నో వందల ఆడియోలు రిలీజ్ చేశాం. ఎవరు హీరో అంటే.. పాట హీరో.. సంగీతం హీరో… సాహిత్యం హీరో. నేను నా మొదటి పాటకు శ్రీలేఖ గారు అద్భతమైన బాణి ఇచ్చారు. అప్పుడు నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. అప్పుడు నన్ను రామానాయుడు గారు ఎంతో ప్రోత్సహించారు. 95లో మొదలైన నా ప్రయాణం… 2023 వరకు 28 సంవత్సరంలో 800 సినిమాల్లో 3600పైగా పాటలు రాశాను. నాకు నా జీవితానికి పరిపూర్ణత తీసుకువచ్చిన సంతవత్సరం 2023, ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్, రెండవదిహాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, మూడవది క్రిటిక్స్ అవార్డ్స్, నాలుగవది ఆస్కార్, ఐదవది బాంబే హంగామా అవార్డు, ఆరవది జాతీయ పురస్కారం. ఇలా ఈ ఏడాదిలో ఆరు అవార్డుల వర్షం కురిసింది. తెలుగుకి వెయ్యి ఏళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాష చరిత్ర ఉంది. తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం… తెలుగులో ఎదుగుతాం, తెలుగులో బతుకుతాం, తెలుగులో చనిపోతాం.. ఇక నాటు నాటు సాంగ్ రాసే అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, కీరవాణి గారికి ఈ పాటను అలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గారికి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి ధన్యవాదాలు. నాటు నాటు పాటను 45 నిమిషాల్లో రాసినప్పటికీ.. దాన్ని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టింది. అంత సహనంగా ఉన్నందుకు ప్రతిఫలం దక్కింది. ప్రతి గాయకుడికి, ప్రతి దర్శకుడికి, ప్రతి సంగీత దర్శకుడికి ధన్యవాదాలు. మురళి మోహన్ గారు 83 ఏళ్లు శాశ్వత యువకులు. ఆయన హుషారుగా పాట వింటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చిన శాస్త్రి గారు.. మా ఇంటి ఎదురే ఉంటారు. ఆయన రావడం గొప్ప విశేషం. మీరందరూ లేకుండే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. భార్యని అర్థంగి అంటారు. నేను అర్ధంగి అనను పూర్ణంగి అంటాను. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం అయిన స్పాన్సార్స్ కు చేతులెత్తి నమస్కారం చేేస్తున్నాను.

ముఖ్య అతిథిగా విచ్చేసిన మురిళి మోహన్ గారు మాట్లాడుతూ… వేదికపై అనేక మంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ చూస్తే.. చివరి వరకు కూర్చోని చూడాలని అనిపిస్తుంది. చంద్రబోస్ మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకువచ్చిన మహానీయుడు. భారతీయ చిత్రసీమ ఆయన్నీ చూసి గర్వపడుతుంది. ఒకే సంవత్సరంలో అస్కార్ అవార్డు.. అదే సంవత్సరంలో జాతీయ అవర్డు తీసుకువచ్చిన ఏకైనా లిరిసిస్ట్ చంద్రబోస్. ఆయన గెలుపు వెనుక సతిమణి ఉన్నారు. వీరి ఆట పాట అద్భుతంగా ఉన్నారు కాబట్టి… వీరు ఆదర్శంగా ఉన్నారు. సుచిత్ర మా పక్కింటి అమ్మాయి. వాళ్ల నాన్న గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్ అదర్. ఇక ఆస్కార్ అవార్డుకు వెళ్లే ముందు చంద్రబోస్ సుచిత్రను పిలిచారు. కానీ ఆమె రాను మీరు వెళ్లండని చెప్పింది. దానికి కారణం పూజ గదిలో నుంచి బయటకు రాకుండా పూజలు నిర్వహించింది.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ… సభా ముఖంగా చంద్రబోస్ గారికి అభినందనలు. చాలా గర్వంగా అనిపిస్తుంది. నా మనసు ఉప్పోంగిపోతుంది. ఎవరి ప్రయాణం అయినా చిన్నగా మొదలు అవుతుంది. పెద్దగా ముగుస్తుంది. నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ.. చంద్రబోస్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన జీవితం గొప్పది. ఆదర్శం అంటూ కొనియాడారు.

సినిమా

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

వేట మొదలైంది.. ప్రశాంత్ నీల్ ప్రపంచంలో అడుగు పెడుతున్న టైగర్..

సెన్సేషనల్ కాంబో కలయికకు టైమ్ ఆసన్నం అయింది. సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైంది....

Killer: ‘కిల్లర్’ మూవీలో మత్తెక్కించే స్పై గర్ల్.. లుక్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

Killer: స్పై, థ్రిల్లర్, యాక్షన్ జోనర్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ జోనర్లో ‘శుక్ర, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’.. వంటి డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పూర్వాజ్ స్వీయ...

క్లాస్ సినిమాకు మాస్ సెలబ్రేషన్స్..!

స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి. స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే ఈ గ్యాప్ లో ఒకప్పటి వారి సినిమాలను...

ఇళయరాజా సంగీతానికి పాట రాయడం అదృష్టం : కీరవాణి

మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజాకు పాట రాయడం నిజంగా తన అదృష్టం అన్నారు మరో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...