సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,669FansLike
57,764FollowersFollow

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం అన్నది సర్వసాధారణమైన విషయం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ జరిగిందది. వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్, టీడీపీల నుంచే కదా వైసీపీలోకి నాయకుల్ని లాగింది.!

ఇక, దేవుడి స్క్రిప్ట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. నిజమే, 23 మంది ఎమ్మెల్యేలు గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి దూకేసిన దరిమిలా, 2‌019లో టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే దక్కారన్న వైసీపీ వాదనని కొట్టి పారేయలేం. మరి, అదే దేవుడి స్క్రిప్ట్ 2024లో ఎన్నికల్లో రిపీట్ అయితేనో.?

అంటే, వైసీపీ హయాంలో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూకేశారు. జనసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి దూకిన సంగతి తెలిసిందే. మొత్తంగా అలా దూకిన ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే, పది దాటదు. ఆ లెక్కన, 2024 ఎన్నికల్లో వైసీపీకి దేవుడి స్క్రిప్టుని అన్వయిస్తే, సింగిల్ డిజిట్ మాత్రమే రావాలి కదా.?

వైనాట్ 175 అంటోంది వైసీపీ గత కొద్ది రోజులుగా.! అంటే, మొత్తంగా అన్ని సీట్లనూ తామే గెలిచేస్తామనీ, టీడీపీకీ అలాగే జనసేనకీ గుండు సున్నా మాత్రమే మిగులుతుందనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయానా చెబుతున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.!

సింగిల్ డిజిట్ కాదు, వైసీపీకి గుండు సున్నా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది ఇంకో వాదన.! టీడీపీ నుంచీ వైసీపీ నుంచీ జనసేన నుంచీ.. ఈ తరహా వాదనలు వినిపించడంలో వింతేమీ లేదు.

తాజాగా, వెలుగు చూసిన ఓ సర్వే ప్రకారం చూస్తే, వైసీపీ 25 సీట్ల లోపే పరిమితమవుతుందనీ, జనసేన – టీడీపీ కూటమి బంపర్ హిట్ కొట్టబోతోందనీ తెలుస్తోంది.

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మావిగన్’ పోటు.! ఇదేం ‘చావు’ రాజకీయం.!

‘మావిగన్’ అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతిష్టమో ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. తాజా ప్రెస్ మీట్‌లో కూడా వైఎస్ జగన్, ‘మావిగన్’ అంటూ, ఊక దంపుడు ప్రసంగం చేసేశారు. ఆ ‘మావిగన్’...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’ చర్చ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. విద్యార్థుల ప్రోత్సాహం కోసం నిర్వహించిన ఈ...

Ramayana: ‘రామాయణ’ సినిమాలో మరో అగ్ర నటి..! ఆసక్తి రేపుతున్న అప్డేట్

Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా...

Bharathiraja: దర్శక దిగ్గజం ‘భారతీరాజా’ కన్నుమూత..! ప్రముఖుల సంతాపం

Bharathiraja: భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా నేడు చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు....

నందూస్ వరల్డ్ వివాదం ఏమిటి?.. అసలు కథ ఇదే!

తెలుగు సోషల్ మీడియా ప్రపంచంలో “నందూస్ వరల్డ్” పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ నందన, ఆమె భర్త మధు ప్రస్తుతం వీసా వ్యవహారానికి సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచారు. యూట్యూబ్ వీడియోలు,...