Viral News: భారతీయుడి పేరును వెటకారంగా ప్రచురించిన కెనడా (Canada) కు చెందిన సంస్థ తగిన మూల్యం చెల్లించుకుంది. తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు కోరి 10వేల డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. భువన్ చిత్రాంశ్ అనే వ్యక్తి.. కెనడాకు చెందిన డీబ్రాండ్ (Dbrand) అనే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ నుంచి మ్యాక్ బుక్ స్కిన్ కొనుగోలు చేశాడు. రెండు నెలల్లోనే రంగు వెలిసిపోవడంతో ఎక్స్ లో కంపెనీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఇందుకు స్పందించిన కంపెనీ అతని పేరులోకి అక్షరాలు మార్చి అర్ధం మార్చి నవ్వులపాలయ్యేలా చేసింది.
దీంతో ‘భారత్ వంటి పెద్ద మార్కెట్ ఆటలా.. ఇకపై మీ వస్తువులు కొనకపోవచ్చు. హద్దు మీరా’రంటూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో డీబ్రాండ్ కస్టమర్ పేరును తప్పుగా పేర్కొన్నామని తమ అంగీకరించింది. ఇందుకు 10వేల డాలర్లు చేల్లిస్తామంది. అయితే.. కస్టమర్స్ పేరును తప్పుగా చెప్పడం ఎన్నో ఏళ్లుగా చేస్తున్నామని.. ఇకపైనా ఆపమని పేర్కొంది. పైగా.. తర్వాత 10,000 డాలర్లు మీరే గెల్చుకోవచ్చిన ప్రకటించి ఆశ్చర్యపరచింది.