Switch to English

అతిరధుల సమక్షంలో ప్రారంభమైన “భ్రమర” మూవీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,843FansLike
57,764FollowersFollow

జి.యం.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నికితశ్రీ, సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి , పృద్వి రాజ్(పెళ్లి), నాగమహేష్, జయవాణి,మీసాల లక్ష్మణ్, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, దువ్వాసి మోహన్, పసునూరి శ్రీనివాస్, మాణిక్యం, టార్జాన్ నటీ నటులుగా టి.వి రవి నారాయణన్ దర్శకత్వంలో జి.మురళీ కృష్ణ నిర్మాణ సారద్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం “భ్రమర”. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..తెలంగాణ ఎఫ్.డి.సి.
చైర్మన్ అనిల్ కుర్మచలం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో

గెస్ట్ గా వచ్చిన హైకోర్ట్ అడ్వకేట్ సుంకర నరేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అయితే ప్రజలను అవగాహన పరస్తూ ప్రజలలో చైతన్యం తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాతలు డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్స్ లో “భ్రమర” అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ టైటిల్ లో ఎటువంటి సౌండ్ ఉందో సినిమాలో కూడా అటువంటి సౌండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మీడియా తో పాటు ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తూ మూవీ యూనిట్ ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సహ నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. రవి నాకు బెస్ట్ ఫ్రెండ్.తను మంచి కాన్సెప్ట్ ఉన్న కథ చెప్పడంతో ఈ సినిమా తీద్దామనుకున్నాను. అయితే నాకు నిర్మాత మురళీ కృష్ణ గారు సపోర్ట్ గా రావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు, హైదరాబాద్ లలో శర వేగంగా షూటింగ్ జరుపుకొని ఇదే సంవత్సరంలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

చిత్ర దర్శకుడు టి.వి రవి నారాయణన్ మాట్లాడుతూ..

డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ మీద ఈ సినిమా నడుస్తుంది. .ఈ కథను కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్ మురళి కృష్ణ గారికి చెప్పగానే కథ నచ్చి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అందుకు వారికి నా ధన్యవాదాలు.ఈ సినిమాను ఊటీ బ్యాక్ డ్రాప్ లో తీద్దాం అనుకున్నాము. అయితే ఊటీ కంటే అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రాహుల్ శ్రీ వాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్ గా కార్తీక్ బి. కొడగండ్ల చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి ,పెళ్లి సినిమా పృద్వి రాజ్ తో పాటు నికితశ్రీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇంకా ఇందులో నటిస్తున్న మిగతా నటీ, నటులు అందరిని త్వరలో తెలియజేస్తాము. అందరూ బాగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్తున్నాము. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

నటి నిత్య శ్రీ మాట్లాడుతూ.. ఇది నా మూడవ సినిమా. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

సినిమా

ఆరుగురు నన్ను లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలనం..

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా తాము ఎదుర్కున్న...

రామ్ చరణ్‌ బర్త్ డే గిఫ్ట్ రెడీ.. ఆ రెండు పోస్టర్లు...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డేకి రెండు గిఫ్ట్ లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్‌ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో చాలా బిజీగా...

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

రాజకీయం

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

ఎక్కువ చదివినవి

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా...

ప్రియదర్శి “సారంగపాణి జాతకం” రిలీజ్ డేట్ ఫిక్స్..

రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఈ...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ...