Chennai: స్టేజిపై అందరూ చూస్తూండగా నటుడి అనుచిత ప్రవర్తనతో ప్రోగ్రామ్ యాంకర్ తీవ్రంగా ఇబ్బంది పడిన సంఘటన చెన్నై (Chennai) లో జరిగింది. అతని తీరు విమర్శలకు తావిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
నటుడు మన్సూర్ ఆలీఖాన్ నిర్మించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమం జరుగుతోంది. యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి ఫేమస్ అయిన కూల్ సురేశ్ (cool suresh) ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యాడు. కార్యక్రమంలో భాగంగా సురేశ్ వేదికపై మాట్లాడుతూ తన చేతిలో ఉన్న పూలమాలను ఒక్కసారిగా పక్కనే ఉన్న యాంకర్ మెడలో వేశాడు. దీంతో వెంటనే ఆమె మాలను తీసి కింద పడేసింది. అతడి చర్యతో ఆగ్రహంతోపాటు కన్నీళ్లు కూడా పెట్టుకుంది.
దీంతో మన్సూర్ ఆలీఖాన్ ఈ చర్యను ఖండిస్తూ అక్కడే అందరి ముందూ క్షమాపణ చెప్పాడు. సురేశ్ కూడా క్షమాపణలు చెప్పాలని అనడంతో సారీ చెప్పాడు సురేశ్. అయితే.. తాను ప్రచారం కోసమే ఈ పని చేశానని చెప్పినా తీవ్ర విమర్శలపాలయ్యాడు. సరేశ్ పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
This is not promotion , but public harrassment ! pic.twitter.com/vA3qFOl5bq
— Prashanth Rangaswamy (@itisprashanth) September 20, 2023