Nelson: రజినీకాంత్ (Rajinikanth) కు జైలర్ (Jailer) తో భారీ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar). ప్రస్తుతం ఈ దర్శకుడి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. నెల్సన్ తన తదుపరి సినిమా తెలుగులో అగ్ర హీరోతో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. వారిలో ఇద్దరి పేర్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ఒకరు మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కాగా మరొకరు అల్లు అర్జున్.
నెల్సన్ ఇటివల మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఓ కథ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. నెల్సన్ చెప్పిన పాయింట్ చిరంజీవికి నచ్చిందని వార్తలు వస్తున్నాయి. జైలర్ తరహాలోనే ఓ పవర్ ఫుల్ కథాంశంతో సినిమా తెరకెక్కిస్తారని అంటున్నారు. మరోవైపు.. అల్లు అర్జున్ ని కలిసి కథ వినిపించారనే వార్తలు కూడా వస్తున్నాయి. అల్లు అర్జున్ కి కథ నచ్చడంతో నెల్సన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. దీనికి అనిరుధ్ సంగీతం అందించనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ ప్రకటనా రాలేదు.