Switch to English

బీజేపీ క్వశ్చన్: జగన్‌ ‘హిందూ’ జపం.. ఓట్ల కోసమేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గోదావరి పుష్కరాల్లో హల్‌చల్‌ చేయడం అప్పట్లో పెను సంచలనమైంది. జగన్‌ హిందూ సంప్రదాయం ప్రకారం ‘పెద్దలకు’ పిండప్రదానాలు చేయడాన్ని చాలామంది తప్పుపట్టారు. అందుక్కారణం ఆయన క్రిస్టియన్‌ కావడమే. అయితే, రాజకీయాల్లోకొచ్చాక కుల మతాలుండవ్‌. చంద్రబాబు వివిధ మతాలకు చెందిన ఆచారాల్ని ఆయా సందర్భాల్లో ఆచరించేస్తుంటారు. చాలామంది రాజకీయ నాయకులు చేసేది అదే.

అయితే, జగన్‌ విషయంలో ఎందుకో కొంత ‘మతం’ రచ్చ జరుగుతుంటుంది. కొంత కాలం క్రితం తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడిపై విశ్వాసం వుందంటూ ‘నోట్‌’ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. అది అక్కడి సంప్రదాయమే అయినా, దాన్ని ఆయన గౌరవించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సంగతి పక్కన పెడితే, ఎన్నికల్లో గెలవడానికి వైఎస్‌ జగన్‌ చాలానే చేశారు. ఇందులో హిందూ ఓటు బ్యాంకుని ఆకట్టుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు చాలా ఎక్కువే.

స్వామీజీల చుట్టూ తిరిగారు.. అస్సలేమాత్రం తనకు ఇష్టం లేని పాద నమస్కారాల్నీ ఆయన ఆయా స్వామీజీలకు చేసేశారు. ముఖ్యమంత్రిగా గెలిచాక కూడా, స్వామీజీలను వైఎస్‌ జగన్‌ కలిసిన విషయం విదితమే. వారంతా తనను ఎన్నికల్లో గెలిపించేందుకు కృషి చేసినందుకుగాను తీర్చుకున్న ‘రుణం’ అనుకోవాలేమో. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అమెరికా పర్యటనలో వున్న వైఎస్‌ జగన్‌, అక్కడ ఓ కార్యక్రమంలో ‘జ్యోతి’ని వెలిగించాల్సి వుండగా, అందుకు ససేమిరా అన్నారు.

నిర్వాహకులు జగన్‌ని ఒప్పించడానికి నానా తంటాలూ పడ్డారు. కానీ, జగన్‌ ఆ పని చేయలేదు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే, అక్కడ పరిస్థితి ఏంటన్నదానిపై పూర్తి స్పష్టత లేదనుకోండి.. అది వేరే విషయం. ఇదిలా వుంటే, శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ‘అన్యమతస్తులకు దుకాణాల కేటాయింపు’ వివాదం తెరపైకొచ్చింది.

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం, షాపుల కేటాయింపుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్‌డ్‌ వ్యవహారాలేనని అనుకోగలమా.? క్రిస్టియన్‌ కాబట్టే వైఎస్‌ జగన్‌ని ఎవరైనా ఈ అంశాల పేరు చెప్పి టార్గెట్‌ చేస్తున్నారని అనుకోగలమా.? అధికారం దక్కాక వైఎస్‌ జగన్‌ తన రియల్‌ కలర్స్‌ని ఇప్పుడు చూపిస్తున్నారని భావించాలా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...