Switch to English

బిగ్ హౌస్ కెప్టెన్‌గా శివజ్యోతి: మహేష్‌ రగిల్చిన ‘అగ్గిపుల్ల’.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ రియాల్టీ మూడో సీజన్‌లో ‘స్పైసీ’ మేటర్‌ తగ్గిందని నిర్వాహకులు ఫీలవడం, ఆ విషయాన్ని నాగార్జునతోనే డైరెక్ట్‌గా చెప్పించడం, ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌ అలర్ట్‌ అవడం తెలిసిన సంగతులే. మహేష్‌ విట్టా తనకు దక్కిన ‘అగ్గిపుల్ల’ అవార్డు పట్ల తీవ్రంగా కలత చెందుతోంటే, ‘మధ్యలో పుల్ల పెట్టడానికి వచ్చావా.?’ అంటూ అలీ రెజా ఆగ్రహంతో ఊగిపోవడం, మహేష్‌ విట్టాకి ఒళ్ళు మండిపోయేలా చేసింది.

బాబా భాస్కర్‌ – అలీ రెజా మధ్య ‘నామినేషన్‌’ వ్యవహారంపై రగడ సాగుతున్న వేళ, ఇద్దరికీ సర్ది చెప్పేందుకు మహేష్‌ విట్టా ప్రయత్నించాడు. లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ ఒకటి వుంది కదా అలీకి. దాంతో, పొరపాటుగా అర్థం చేసుకుని, మహేష్‌ని తిట్టేశాడు. ఊహించని ఈ పరిణామంతో మహేష్‌ షాకయ్యాడు. ఆ తర్వాత హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌ వద్ద తన ఆవేదనను చెప్పుకున్నాడు మహేష్‌.

అది తెలుసుకున్న అలీ రెజా, ఇంకోసారి మహేష్‌పై మండిపడిపోయాడు. ఈ క్రమంలో గొడవ బాగా ముదిరిపోయింది. కంట్రోల్‌ చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదు సరికదా, గొడవని పెంచడానికే మిగతా హౌస్‌మేట్స్‌ ప్రయత్నించారు ఒకరిద్దరు తప్ప. ఇదిలా వుంటే, అలీ రెజా తనను వెన్నుపోటు పొడిచాడంటూ బాబా భాస్కర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శ్రీముఖి ఇచ్చిన ఓదార్పుతో బాబా భాస్కర్‌ పైకి హుషారుగా కన్పిస్తున్నా, లోలోపల రగిలిపోతున్న మాట వాస్తవం.

మరోపక్క, వితిక – పునర్నవిలను సరదాగా ర్యాగింగ్‌ చేశారు శివజ్యోతి, శ్రీముఖి. ఆ తర్వాత కెప్టెన్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఆ టాస్క్‌కి అర్హత సాధించారు శివజ్యోతి, వితిక షెరు. అయితే టాస్క్‌లో మాత్రం వితిక షెరు ఓడిపోయింది. అలా శివజ్యోతికి కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఆమెకి ఏ ఎమోషన్‌ అయినా ఒక్కటే.. అదే ఏడుపు. సహజంగానే ఏడుపుకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన శివజ్యోతి, కెప్టెన్‌గా అవకాశం దక్కాక కూడా అదే ఎమోషన్‌ని పండించింది.

మొత్తమ్మీద, బిగ్‌హౌస్‌లో ఓ పెద్ద అపార్థమైతే చోటు చేసుకుంది. నిజానికి నిర్వాహకులకు కావాల్సింది కూడా అదే. కొట్టుకునేదాకా వ్యవహారం వెళ్ళేలా ఆ వివాదం నడిచిందిగానీ, సద్దుమణగడం కొంత సంతోషించదగ్గ విషయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...