Switch to English

జనసేనానీ.. అందుకే నువ్వు ‘దేవుడివి’ సామీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

దేవుడిలా మాయలు మంత్రాలు తెలిసి వుంటే బావుండేదేమో.! ఏం, ఆ మాయలూ మంత్రాలూ తెలియకపోయినా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ దేవుడే. కోట్లాదిమంది అభిమానులు పవన్‌ కళ్యాణ్‌ని ఓ సినీ నటుడిగానో, రాజకీయ నాయకుడిగానో చూడరు.. ఆయన్ని దేవుడిగానే భావిస్తారు. దేవుడంటే, అందరికీ మంచి చేసేవాడని.

ఆ మధ్య ఖమ్మం జిల్లాలో ఓ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడితే, ఆమె బతికే అవకాశాలే లేవని వైద్యులు తేల్చేస్తే.. ఆ అభిమానిని పలకరించేందుకు పవన్‌కళ్యాణ్‌ వెళ్ళడం అందరికీ గుర్తుండే వుంటుంది. తన అభిమాన హీరోని చూడలేని దుస్థితి అప్పట్లో ఆ చిన్నారిది. ఆ చిన్నారి దయనీయ స్థితి చూసి పవన్‌ కళ్యాణ్‌ కళ్ళు చెమర్చాయి. ‘ఆమె బతుకుతుంది.. నా దగ్గరకు ఆరోగ్యంగా వస్తుంది..’ అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు పవన్‌ కళ్యాణ్‌.

పవన్‌ కళ్యాణ్‌ దేవుడేనేమో.. లేకపోతే, ఆ చిన్నారి కోలుకోవడమేంటి.? కోలుకుని, పవన్‌ చెప్పినట్లుగా నడవడమేంటి.? పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్ళి కలవడమేంటి.? ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌. అన్ని సందర్భాల్లోనూ అలా జరుగుతుందని అనుకోలేం. జరగాలని ఆశిద్దాం. మంచి జరిగితే, ఆ మంచి ఎవరి వల్ల జరిగినా అభినందించాల్సిందే.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌, మరో అభిమానిని అత్యంత దయనీయ స్థితిలో పరామర్శించారు. సినీ నటుడిగా పవన్‌ కళ్యాణ్‌ని అభిమానించిన బుడిగయ్య అనే వ్యక్తి, జనసేన కార్యకర్తగా మారాడు. జనసేన పార్టీ కోసం పనిచేశాడు. మరోపక్క క్యాన్సర్‌, బుడిగయ్యను కబళించేస్తోంది. ఓ వైపు వైద్య చికిత్స పొందుతూనే, జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు బుడిగియ్య. వ్యాధి ముదరడంతో మంచానికే పరిమితమైన జనసైనికుడ్ని పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌ ఆయన స్వగ్రామం వెళ్తానని కూడా పార్టీ శ్రేణులకు సమాచారమిచ్చారు.

ఇంతలో ఆ అభిమాని, అంబులెన్స్‌ సాయంతో పార్టీ కార్యాలయానికి రావడంతో, అంబులెన్స్‌లోనే తన అభిమానిని పరామర్శించారు పవన్‌ కళ్యాణ్‌. సదరు అభిమాని ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్న పవన్‌, అక్కడికక్కడ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాదు, మెరుగైన వైద్య చికిత్స విషయమై ఆసుపత్రి వర్గాలతో తాను మాట్లాడతానని భరోసా ఇచ్చారు.

బుడిగయ్య కోలుకోవడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో పార్టీ ముఖ్య నేతలకూ ఆదేశాలు జారీ చేశారు పవన్‌ కళ్యాణ్‌. నాలుగు రాజకీయ విమర్శలు చేశాం.. నాలుగు సినిమా డైలాగులు చెప్పాం.. అంటే కాదు.! మానవత్వం ముఖ్యం. అది మెండుగా వుంది కాబట్టే, పవన్‌ కళ్యాణ్‌ని అభిమానులు ‘దేవుడు’గా కొలుస్తుంటారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...