Switch to English

బర్త్‌డే స్పెషల్‌: ఈ భానుమతి రూటే సపరేటు

భానుమతి హైబ్రీడ్‌ పిల్లా అంటూ ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి విలక్షణ నటి. మొదటి సినిమా నుండే తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడంతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఎక్స్‌ పోజింగ్‌కు నో చెబుతూ కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంది. కోట్ల ఆఫర్‌ ఇచ్చినా కూడా స్కిన్‌ షోకు నో చెప్పి తనదైన ప్రత్యేకతను నిలుపుకుంది.

బుల్లి తెరపై డాన్సర్‌గా మెప్పించిన సాయి పల్లవి అనుకోకుండా హీరోయిన్‌ అయ్యింది. కొరియోగ్రఫర్‌గా ఎంపిక అయిన సాయి పల్లవి అదే సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ను దక్కించుకుంది. వచ్చిన మొదటి ఆఫర్‌కు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. ప్రేమమ్‌ చిత్రంలో సాయి పల్లవి పోషించిన మలర్‌ పాత్ర ఏ స్థాయిలో సక్సెస్‌ అయ్యిందో అందరికి తెల్సిందే. ఆ పాత్రతో సౌత్‌ ఇండియా మొత్తం ఫేమస్‌ అయ్యింది. ఆ పాత్రతోనే తెలుగులో ఈమెకు ఫిదా చిత్రంలో ఛాన్స్‌ను శేఖర్‌ కమ్ముల ఇచ్చాడు.

మలయాళ అమ్మాయి తెలుగు మాట్లాడటమే కష్టం అనుకుంటే తెలంగాణ యాసను అద్బుతంగా మాట్లాడి పాత్రకు ప్రాణం పోసింది. భానుమతి పాత్ర ఎప్పటికి గుర్తుండి పోతుంది. ఫిదా చిత్రం కమర్షియల్‌గా బిగ్‌ హిట్‌ అవ్వడంలో సాయి పల్లవి పాత్ర ఖచ్చితంగా ప్రముఖంగా ఉందనే విషయం ఎవరు కాదనలేరు.

డాన్స్‌లో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఎన్నో డాన్స్‌ షోల్లో పాల్గొని, స్టేజ్‌ షోలు ఇచ్చింది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ ఈటీవీలో 2009వ సంవత్సరంలో ఢీ 4 లో సాయి పల్లవి కనిపించింది. ఆ సమయంలో తెలుగు ప్రేక్షకులు సాయి పల్లవి ఈ స్థాయిలో సక్సెస్‌ అవుతుందని ఊహించి ఉండరు. ఒక అద్బుతమైన డాన్సర్‌ అంటూ అప్పుడే సమంతతో ప్రశంసలు దక్కించుకుంది.

డాన్సర్‌ అవ్వడం వల్లో ఏమో కాని ఎక్స్‌ ప్రెషన్స్‌ విషయంలో సాయి పల్లవి అద్బుతమైన నటి అనిపించుకుంది. తెలుగులో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఫిదా సక్సెస్‌ను ఆమె క్యాష్‌ చేసుకోవాలనుకోలేదు. మంచి పాత్రలను మాత్రమే చేయాలనుకుంది. ఒకవేళ సాయి పల్లవి కనుక కమర్షియల్‌ పాత్రలు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆమెకు ఈజీగా ఏడాదికి మూడు నాలుగు ఆఫర్లు వచ్చేవి. కోట్ల పారితోషికాలు వద్దనుకుని మరీ మనసుకు నచ్చిన పాత్రలు చేస్తూ వస్తోంది.

దిల్‌రాజు బ్యానర్‌లో ఒక సినిమాను పాత్రకు ప్రాముఖ్యత లేదనే కారణంగా వదిలేసింది. అప్పట్లో అదో సంచలనంగా చెప్పుకోవచ్చు. సాయి పల్లవికి పొగరు అని కూడా కొందరు అంటూ ఉంటారు. గ్లామర్‌ పాత్రలకు ఒప్పుకోని హీరోయిన్స్‌ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగే పరిస్థితి ఉండదు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌ విషయంలో అది నిరూపితం అయ్యింది.

సాయి పల్లవి కూడా గ్లామర్‌ రోల్స్‌కు ఒప్పుకోకుంటే త్వరలోనే ఆమె సర్దేసుకోవాల్సిందే అంటూ కొందరు విమర్శలు చేస్తున్నా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చిన పాత్రలు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. తెలుగులో ఈమె నటించిన లవ్‌ స్టోరీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. మరో వైపు రానాతో కలిసి విరాటపర్వం అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక తమిళంలో ఈమెకు రెండు ఆఫర్లు చేతిలో ఉన్నాయి.

లిమిటెడ్‌గా సినిమాలు చేస్తూ తన రూటే సపరేటు అనిపించుకుంటున్న ఈ వెండి తెర భానుమతి పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఈమె మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం.

తెలుగు బులిటెన్‌ టీం మరియు ఆమె అభిమానుల తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

తనపై వస్తున్న విమర్శలకు నాగబాబు కౌంటర్

మెగా బ్రదర్ నాగబాబు రెండు రోజుల క్రితం నాధూరామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడు అంటూ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా...

ఫ్లాష్ న్యూస్: రెండు నిమిషాల్లో 70 వేల ఫోన్స్‌ అమ్ముడు పోయాయి

గత రెండు నెలలుగా ఈకామర్స్‌ బిజినెస్‌ పూర్తిగా స్థంభించిన విషయం తెల్సిందే. ప్రతి రోజు వందల కోట్ల వ్యాపారం స్థంభించడంతో ఈకామర్స్‌ సంస్థలు భారీగా నష్టపోయారు. ఇక మొబైల్‌ అమ్మకాలు కూడా పూర్తిగా...

ఫ్లాష్ న్యూస్: మాస్కుల్లో ఈ మాస్క్ వేరయా..

లాక్ డౌన్ ఆంక్షలు కొద్దిగా తొలగడంలో ప్రజలంతా బయటకి వస్తున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ.. మాస్క్ లేకుండా ఎవరూ రావటం లేదు....

రానా, మిహీకల నిశ్చితార్ధం నేడే

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో అల్లరి కుర్రాడిగా పేరుంది. ఇండస్ట్రీలో తన తోటి వయసు నటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానాపై గతంలో కొన్ని లింకప్ రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ రానా తోసిపుచ్చాడు....