Switch to English

బర్త్‌డే స్పెషల్‌: సరికొత్త సూపర్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇండస్ట్రీలో ఆఫర్లతో పాటు లక్‌ కూడా కలిసి రావాలి. ఆ లక్‌ ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో విజయ్‌ దేవరకొండకు కలిసి వచ్చింది. అంతకు ముందు చేసిన సినిమాల్లో కనీసం ఆయన్ను గుర్తించే పరిస్థితి కూడా లేదు. కాని ఎవడే సుబ్రమణ్యం చిత్రంలో హీరో నానికి సమానమైన స్థాయి గుర్తింపును దక్కించుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ఆ సినిమాతోనే ఇతడు కాస్త భిన్నంగా ఉన్నాడే అనిపించుకున్నాడు. మంచి నటనతో పాటు ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్‌ డైలాగ్‌ డెలవరీ అతడి సొంతం.

ఎవడే సుబ్రమణ్యం తర్వాత హీరోగా అతడు చేసిన చిత్రం పెళ్లి చూపులు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన పెళ్లి చూపులు చిత్రం సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యింది. ఆ సినిమాతో విజయ్‌ దేవరకొండ కొందరికి చేరువయ్యాడు. ఆ తర్వాత చేసిన అర్జున్‌ రెడ్డి చిత్రం అతడి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. తెలుగు సినిమాలో అదో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అర్జున్‌ రెడ్డి చిత్రంలో విజయ్‌ దేవరకొండ నటన మరియు ఆయన డైలాగ్‌ డెలవరీతో యూత్‌ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నాడు.

సెన్షేషనల్‌ స్టార్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండను మరో మెట్టు ఎక్కించిన చిత్రం గీత గోవిందం. ఆ చిత్రంతో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు. ఇండస్ట్రీలోని ఇతర హీరోలకు తాను విభిన్నం అంటూ ప్రతి సందర్బంలోనూ ప్రూవ్‌ చేసుకుంటూ తనకు నచ్చింది చేస్తూ, తాను అనుకున్నది మాట్లాడుతూ వెళ్తున్నాడు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్‌ ఇండియా గుర్తింపు దక్కించుకున్నాడు. గీత గోవిందం తర్వాత మళ్లీ సరైన కమర్షియల్‌ సక్సెస్‌ దక్కకున్నా కూడా విజయ్‌ స్టార్‌ డం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో విజయ్‌ ‘ఫైటర్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు.
ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కరణ్‌ జోహార్‌ ఈ చిత్రానికి నిర్మాత అవ్వడంతో ఖచ్చితంగా అక్కడ మంచి మార్కెట్‌ను ఈ యంగ్‌ స్టార్‌ సృష్టించుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

స్టార్‌ హీరోలు అంతా ఇతక బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటే విజయ్‌ మాత్రం తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేశాడు. దానికి రౌడీ బ్రాండ్‌ అనే పేరు పెట్టాడు. యూత్‌లో రౌడీ బ్రాండ్‌ క్లాత్స్‌ కు విపరీతమైన క్రేజ్‌ ఉంది.

ఫ్యాన్స్‌ను రౌడీస్‌ అంటూ ముద్దుగా పిలుస్తాడు. ఆయన్ను ఫ్యాన్స్‌ రౌడీ స్టార్‌ అంటూ నెత్తిన పెట్టుకుని మరీ అభిమానిస్తున్నారు. విజయ్‌ను సరికొత్త సూపర్‌ స్టార్‌ అంటూ ఫ్యాన్స్‌ పిలుచుకుంటారు.

ఒక సామాన్యమైన కుటుంబం నుండి, చదువుకు కూడా సరిగా డబ్బులు పెట్టలేని కుటుంబంలో జన్మించిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం కొన్ని వందల మంది కడుపు నింపేలా ఛారిటీలు నిర్వహిస్తున్నాడు. తన పేరు మీద ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి మద్యతరగతి వారికి సాయం చేస్తూ ఉన్నాడు.

తెలుగులో టైర్‌ 2 హీరోల్లో టాప్‌ ప్లేస్‌లో ఉండే విజయ్‌ దేవరకొండ భవిష్యత్తులో టాప్‌ హీరోల జాబితాలో చేరడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

స్టార్‌డంకు సరికొత్త నిర్వచనం చెప్పడంతో పాటు, తెలుగు సినిమా హీరో ఇలా కూడా ఉండవచ్చు అని నిరూపించిన స్టార్‌ విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు నేడు. ఆయనకు ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటూ ముందు ముందు మరిన్ని బ్లాక్‌ బస్టర్స్‌ ఆయన నుండి రావాలని మా తరపున, ఆయన రౌడీస్‌ తరపున ఆశిస్తున్నాం.

ఈ సందర్బంగా ఆయనకు తెలుగు బులిటెన్‌ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ గిఫ్ట్.. ఎప్పుడైతే అప్పుడే

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి శైలి వేరు. ప్రమోషన్స్ కు చాలా ప్రాధాన్యతను ఇస్తాడు జక్కన్న. తన హీరోల్ని ప్రోజెక్ట్ చేయడంలో కూడా ముందుంటాడు. బాహుబలికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ హైప్...

దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

ఈసారి సూర్య ఆ పని చెయ్యట్లేదు.!

తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్న కొంత మంది తమిళ హీరోల్లో సూర్య కూడా ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తమిళంలో సినిమా...

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...