Switch to English

విశాఖ గ్యాస్‌ లీక్‌: ప్రమాద తీవ్రతని తగ్గించి చూపించే యత్నమా.?

12 మంది ప్రాణాల్ని బలిగొన్న విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడంలేదా.? విపక్షాల విమర్శల్లో నిజమెంత.? అధికార పార్టీకి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి, ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో కీలక వ్యక్తిగా వున్నారా.? ఆ కారణంగానే, కంపెనీ నుంచి ఇప్పించాల్సిన నష్ట పరిహారాన్ని తగ్గించేందుకోసం.. ప్రభుత్వం హడావిడిగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసిందా.? ఇలా చాలా అనుమానాలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒక్కో మృతుడి కుటుంబానికీ కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించాల్సిందే.

ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని కూడా అహ్వానించాలి. కానీ, నాణానికి ఇంకో వైపు కూడా ఖచ్చితంగా చూడాలి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఈ ఘటనని చాలా సీరియస్‌గా తీసుకుంది. 50 కోట్ల రూపాయల్ని తక్షణ జరీమానాగా చెల్లించాలని ఆదేశించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా సహా మొత్తం ఐదు గ్రామాలకు చెల్లిస్తోన్న మొత్తం, ఈ 50 కోట్లతో పోల్చితే తక్కువే. తక్షణ జరీమానానే 50 కోట్లు వుంటే, వాస్తవ జరీమానా ఎంత పెద్ద మొత్తంలో వుండొచ్చు.? ఆ స్థాయిలో జరీమానాని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ విధించడమంటే, ఘటన తీవ్రత చాలా చాలా ఎక్కువన్నమాట.

ఒక్కో మృతుడి కుటుంబానికీ 10 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించినా తక్కువేనన్న చర్చ జరుగుతోందిప్పుడు. విపక్షాల నుంచి ఈ తరహా వాదనలు విన్పించడం సర్వసాధారణమైనా, ఇలాంటి తీవ్రమైన ప్రమాదాల నేపథ్యంలో, ‘అదీ నిజమే కదా..’ అన్న భావన సాధారణ ప్రజానీకంలోనూ వ్యక్తమవుతోంది. ‘ప్రమాదకర వాయువు లీకేజీ ఇంకా అదుపులోకి రాలేదు.. కానీ, తీవ్రతను తగ్గించగలిగాం..’ అనే ప్రకటనలు ఓ పక్క వస్తున్నాయి. ఇంకోపక్క, ‘ప్రమాదం ఏమీ లేనట్టే..’ అనే ప్రకటనలూ ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఏది నిజం.? ముఖ్యమంత్రి ప్రకటన ఒకలా, పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటన ఇంకోలా, అధికార యంత్రాంగం మరొకలా ఈ ఘటనపై వస్తుండడంతో అంతా విస్తుపోతున్నారు. తక్షణం పరిశ్రమను మూసెయ్యాలి.

ఆ ఉద్దేశ్యమే లేనట్టు, ‘ఆ పరిశ్రమలో బాధిత కుటుంబాల నుంచి ఒకరికి ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పడమేంటట.? ఏదిఏమైనా, ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన తదనంతర పరిణామాలు చాలా అనుమానాలకు కారణమవుతున్నాయి. ప్రమాద తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం జరుగుతున్నట్లే కన్పిస్తోంది. అయితే, అది ప్రభుత్వం తరఫు నుంచే కావడం దురదృష్టకరమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...

దేవుడి భూముల అమ్మకం.. దేవుడే రక్షించుకోవాలేమో..

అసలు హిందూ దేవాలయాలకు పాలక మండళ్ళు ఎందుకు.? దేవాలయాల్ని పరిపాలించడమా.? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటివి కాదు. కానీ, ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. దేవాలయాల్లోనే ప్రసాదాల అమ్మకాలు.. అదీ అధికారికంగా జరుగుతుంటాయి....

ఫ్లాష్ న్యూస్: ఆఫ్రికా నుండి ఇండియాకు చేరిన మిడుతల దండు

మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలను అల్లాడించి అతలాకుతలం చేసిన మిడతల దండు పాకిస్తాన్ మీదుగా ఇండియా చేరింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో ఈ మిడతల దండు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట...

టీటీడీ భూముల అమ్మకాన్ని తప్పు పట్టిన వైసీపీ ఎంపీ!

టీటీడీ భూముల వేలం వ్యవహారం అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. తమిళనాడులో వున్న భూముల్ని వేలం వేయడం ద్వారా సొమ్ము చేసుకోవాలన్న టీటీడీ ఆలోచనపై భక్తలోకం నుంచి తీవ్ర వ్యతిరేకత...