బిగ్ బాస్ 5 లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. బొమ్మల ఫ్యాక్టరీలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వచ్చాయి. మొత్తం అన్ని బొమ్మలు లెక్కపెట్టిన తర్వాత గ్రీన్ టీమ్ వద్ద ఎక్కువ ఉండగా రెడ్ టీమ్, బ్లూ టీమ్ 17 బొమ్మలను కుట్టాయి. ఎల్లో టీమ్ 14 బొమ్మలతో సరిపెట్టుకుంది. అయితే రెడ్ టీమ్ కు ఒక స్పెషల్ పవర్ వచ్చింది. దీని ప్రకారం ఏ టీమ్ లో సగం బొమ్మలనైనా చించేసి రిజెక్ట్ దాంట్లో వేయొచ్చు.
రెడ్ టీమ్ ఇక్కడే కొంత అన్యాయంగా చేసినట్లు అనిపించింది. గ్రీన్ టీమ్ వద్ద ఎక్కువ ఉన్నా కూడా ఎల్లో టీమ్ బొమ్మలను చించాలని ఫిక్స్ అయ్యారు. దీని వల్ల రెడ్ టీమ్ కూడా టాప్ కు వెళ్ళదు. అయినా కూడా ఎల్లో టీమ్ వే చించారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే పిల్లోస్ ను కట్ చేసి అందులోంచి దూది తీయడం ద్వారా తప్పు చేసిన గ్రీన్ టీమ్ ను ఆ తప్పును చూడని సంచాలకులు సిరి, కాజల్ లను కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించారు. ఎల్లో టీమ్ బొమ్మలు అప్పటికే తగ్గిపోవడంతో బ్లూ టీమ్, రెడ్ టీమ్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.
ఇక్కడ పిల్లోస్ నుండి దూది తీయాలన్న ఐడియా రవిది అయితే క్లియర్ గా శ్వేతా, లోబో ఇంప్లీమెంట్ చేసారు. దీనికి శ్వేతా తానేం తప్పు చేయనట్లు రవి ఒక్కడే దీనికి బాధ్యుడు అయినట్లు మాట్లాడింది. అయినా రవి కూడా మరోసారి తప్పు ఆలోచనతో రాంగ్ స్టెప్ వేసాడు. టాస్క్ పరంగా ఆ తర్వాత అందరి మీద అరవడం లాంటి వాటితో శ్వేతా నెగటివ్ అవుతోంది.
తదుపరి రౌండ్ కెప్టెన్సీ టాస్క్ లో ఇసుకను బస్తాల్లో వేసుకుని కొన్ని అడ్డంకులను దాటుకుంటూ అవతల డబ్బాల్లో వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో చాలా సునాయాసంగా గెలిచిన విశ్వ బిగ్ బాస్ లో సెకండ్ టైమ్ కెప్టెన్ అయ్యాడు. ప్రతీ సారి రేషన్ మ్యానేజర్ ను కెప్టెన్ ఎంపిక చేసుకునేవారు కానీ ఈసారి ముగ్గురిని ఎంపిక చేయమని వారికి టాస్క్ ఇచ్చారు. మానస్, సన్నీ, ప్రియాంక రేషన్ మ్యానేజర్ టాస్క్ లో పోటీ పడగా ప్రియాంక సునాయాసంగా గెలిచింది.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో హైలైట్స్ అంటే సన్నీ కామెడీ గురించి చెప్పుకోవాలి. కంటెస్టెంట్స్ ను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే షణ్ముఖ్ మీద సిరి అలగడం, దానికి మళ్ళీ షణ్ముఖ్ సారీ చెప్పడం బాగుంది. అలాగే మానస్ అంటే ప్రియాంక పొసెసివ్ గా తీసుకోవడం, సిరి ఆటపట్టించడం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాయి.