న్యాచురల్ స్టార్ నాని రెగ్యులర్ గా సినిమాలను లైన్లో పెడతాడు. సినిమా సినిమాకూ మధ్య పెద్దగా గ్యాప్ తీసుకోవడం కూడా నచ్చదు. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమాను షూటింగ్ కు సిద్ధం చేస్తుంటాడు. కరోనా వల్ల నాని స్పీడ్ తగ్గింది కానీ లేదంటే ఏడాదికి మూడు సినిమాలను విడుదల చేయడం నాని స్టైల్.
కథ విషయంలో కాంప్రమైజ్ కాని నాని గత రెండు సినిమాలుగా కొంత ట్రాక్ తప్పినట్లు అనిపించింది. వి, టక్ జగదీష్ నిరాశ పరిచిన నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలను చేస్తున్నాడు నాని.
ప్రస్తుతం మరో సినిమాను కూడా ఓకే చేసాడు. శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్న నాని ఈ చిత్రంలో సింగరేణి బ్యాక్ డ్రాప్ యువకుడిగా కనిపిస్తాడట. తమిళ చిత్రాలతో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్న సంతోష్ నారాయణన్ తొలిసారి ఒరిజినల్ తెలుగు చిత్రానికి పనిచేయబోతున్నాడు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయి.