Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: ఏపీ రాజధాని.. విశాఖకు అల్లంత దూరాన.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

విశాఖపట్నం నగరానికి ఉత్తరంగా సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో సెక్రెటేరియట్‌ సహా రాజధానికి సంబంధించిన భవనాల నిర్మాణం వుండాలట. ఇదీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి విషయమై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నియమించిన జీఎన్‌ రావు కమిటీ తేల్చిన విషయం. చావు కబురు చల్లగా అందడం అంటే ఇదే మరి. విశాఖపట్నం నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో.. అదీ సముద్ర తీరానికి దూరంగా.. అంటే, రాజధానిని ఎక్కడ నిర్మించాలో మరి.!

నిన్న మొన్నటిదాకా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌.. అంటూ నానా హడావిడి జరిగింది.. జరుగుతూనే వుంది. ఆ విశాఖ మీద ప్రభుత్వం తాలూకు ప్రేమ వెనుక అసలు కథ ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. సాక్షాత్తూ జీఎన్‌ రావు మీడియా ముందుకొచ్చారు.. మీడియాలో వచ్చిన కథనాల్ని అయితే తప్పు పట్టేశారుగానీ, విశాఖపై అనుమానాలకు మాత్రం ఆయన నివృత్తి కలిగించలేకపోయారు.

విశాఖపట్నం నగరానికి వున్న ప్రతికూలతల గురించి నివేదికలో పేర్కొన్న మాట వాస్తవమేనని చెబుతున్నారాయన. ఆ ప్రతికూలతలకు దూరంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ నిర్మించాలని తాము సూచించినట్లు జీఎన్‌ రావు వెల్లడించారు. మాటకీ మాటకీ పొంతన లేకుండా మాట్లాడితే ఎలా.? అదీ, కీలకమైన రాజధాని, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై ఏర్పాటైన కమిటీకి నేతృత్వం వహించిన వ్యక్తి ఇంత కన్‌ఫ్యూజన్‌తో మాట్లాడటమా.?

ఇక్కడ ఒక మేటర్‌ క్లియర్‌గా అర్థమవుతోంది. అదేంటంటే, ఓ స్క్రిప్ట్‌ ప్రకారమే జీఎన్‌ రావు కమిటీ పనిచేసింది.. ఆ స్క్రిప్ట్‌నే బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ఫాలో అయ్యింది. నిజానికి, ఆ స్క్రిప్ట్‌ని ఈ రెండూ సరిగ్గా ఫాలో అవలేదనీ, మధ్యలో ప్రభుత్వం నుంచి ఎదురైన కొన్ని సవాళ్ళతో మొత్తం కథ గందరగోళంగా తయారయ్యిందనీ అర్థం చేసుకోవాల్సి వుంటుంది. విశాఖకి 50 కిలోమీటర్ల దూరంలో.. అదీ సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో.. అంటే అలాంటి అనువైన ప్రాంతం అసలు విశాఖలో వుందా.? ఉత్తరాంధ్ర ప్రజలు ముక్కన వేలేసుకుంటున్నారు.. ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...