Switch to English

Bichagadu 2: బిచ్చగాడు 2 తో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం- విజయ్ ఆంటోనీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,562FansLike
57,764FollowersFollow

Bichagadu 2: 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తో వస్తున్నాడు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్
విజయ్ కుమార్ మాట్లాడుతూ… ‘ ఏపి, తెలంగాణలో ఫస్ట్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్ విజయ్ ఆంటోనీ గారు. ఫస్ట్ పార్ట్ చేసిన చదలవాడ శ్రీనివాసరావుగారు పెద్ద విజయం చూశారు. ఈ చిత్రం మే 19న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోనీ గారూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన గొప్ప మానవతా వాది. అలాగే వారి భార్య ఫాతిమా గారి సపోర్ట్ మరవలేను. నేను ఈ సినిమా రెండు రీళ్లు చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రెండు రీళ్లకే నెక్ట్స్ ఏంటీ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటున్నాను అన్నారు

నటుడు జాన్ విజయ్ మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా స్టేజ్ మీద నించున్నాను. ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్ యూ. విజయ్ నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు. బాగా క్లోజ్. అతను హార్డ్ వర్క్ నే నమ్ముతాడు. సింపుల్ హ్యూమన్ బీయింగ్. మ్యూజిక్ డైరెక్టర్ గానే ఎన్నో సంచలనాలు సృష్టించాడు విజయ్. ఏ అంచనాలూ లేకుండా వచ్చిన బిచ్చగాడు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు పరిశ్రమ ఈ చిత్రాన్ని ఎంతో ఆదరించింది. ఈ సారి దర్శకుడుగా మరింత పెద్ద బాధ్యత తీసుకున్నాడు విజయ్. బట్ ఈ సారి కూడా మిమ్మల్ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయడు. ఖచ్చితంగా అందరి అంచనాలను ఈ మూవీ అందుకుంటుంది.. మీ అందరికీ బాగా నచ్చుతుంది.. ” అన్నారు.

తెలుగు అనువాద రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మాటలు, పాటలూ నేనే రాశాను. 2016లో వచ్చిన బిచ్చగాడు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అప్పుడు నన్ను నమ్మినట్టుగానే మరోసారి నాకు అవకాశం ఇచ్చారు. సినిమా చూస్తోంటే విజయ్ ఆంటోనీ గారు ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసినట్టుగా లేదు. ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేశారు. మీ అందరి అంచనాలకు మించి ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది .. ” అన్నారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని గొప్ప డిస్ట్రిబ్యూటర్స్ గా పేరు తెచ్చుకున్న ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారి అబ్బాయి విజయ్ విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రం నా ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా పెద్ద హిట్ కావాలి. ఆయన ఇంకా గొప్ప సినిమాలు తీయాలి. విజయ్, ఫాతిమాలది స్టాండర్డ్ కంపెనీ. ఏ సినిమా అయినా సందేశం ఉండేలా చూసుకుంటారు. ఈమూవీ టైమ్ లో విజయ్ కి పెద్ద యాక్సిడెంట్ అయింది. అయినా ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా అందంగా కనిపిస్తున్నారు. ఆయన ఇంకా మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్యూ సోమచ్.. ” అన్నారు.

ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని నాకు బాగా తెలిసిన ఉషా పిక్చర్స్ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఫస్ట్ పార్ట్ లో అద్భుతమైన పాయింట్ తో వచ్చారు. ఆ టైమ్ లో ఈ సినిమా అన్ని బంధాలను బాగా గుర్తు చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి సెంటిమెంట్ తోనే ఈ చిత్రం వస్తున్నట్టు కనిపిస్తోంది. నాకు చెల్లి చెల్లీ అనే పాట చాలా ఇష్టం. ఈ పాట ఎంత గొప్పగా తీసి ఉంటారో ఊహించగలను. ఈ సినిమా చాలా చాలా పెద్ద విజయం సాధించాలని.. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఏ లాట్.. ” అన్నారు.

హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ విజయ్ సర్ అండ్ ఫాతిమా మాడమ్.. ఈ మూవీ జర్నీలో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది. అద్భుతమైన ఎమోషన్ కనిపిస్తుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ అనేక మలుపులు, ట్విస్ట్ లు మిమ్మల్ని సీట్లో కూర్చోనివ్వవు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ నెల 19న విడుదలవుతోన్న మా సినిమాను మీరంతా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను .. ” అన్నారు.

హీరో, దర్శకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ” పిలవగానే వచ్చిన గెస్ట్‌ లందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. మా సినిమాను విడుదల చేస్తున్న విజయ్ గారూ థ్యాంక్యూ సో మచ్. హీరోయిన్ కావ్యే నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది. తనకు థ్యాంక్యూ. ఇండస్ట్రీలో మొదటి నుంచీ నన్ను సపోర్ట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెబుతున్నాను. బిచ్చగాడు తర్వాత మరో బిగ్ బ్లాక్ బస్టర్ వస్తోంది. పార్ట్ ఒన్ లో చూసిన దానికంటే లార్జర్ స్కేల్ లో సెకండ్ పార్ట్ లో చూస్తారు. మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు. ఈ 19న మీరంతా ఫ్యామిలీస్ తో వచ్చి థియేటర్స్ లో సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ” అన్నారు..

నిర్మాత ఫాతిమా ఆంటోనీ మాట్లాడుతూ …. బిచ్చగాడు సినిమాను మీరు ఎంతో ఆదరించారు బిచ్చగాడు 2 అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది ఈ నెల 19 న థియేటర్ లలో వస్తుంది అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Naga Babu: నా మాటలు ఎవరినీ ఉద్దేశించి కాదు.. క్షమించండి: నాగబాబు

Naga Babu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆపరేషన్ వాలంటైన్’ (Operation Valentine). ఇటివలే సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్...

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ విడుదల

ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం ముందునుంచి చెబుతున్నట్టుగానే "రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి" ట్రైలర్ ఎంతో వైవిధ్యంగా...

Gautham Menon: ధృవ నక్షత్రం విషయంలో మనశ్శాంతి లేదు: గౌతమ్ మేనన్...

Gautham Menon: విక్రమ్ (Vikram) హీరోగా ప్రముఖ స్టార్ డైరక్టర్ గౌతమ్ మేనన్ (Gautham Menon) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ధృవ నక్షత్రం’ (Dhruva Nakshatram)....

Gaganyaan: ‘గగన్ యాన్ వ్యోమగామి నా భర్త..’ గర్వంగా ఉందన్న హీరోయిన్

Gaganyaan: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర 'గగన్ యాన్' (Gaganyaan) కు సర్వం సిద్ధమవుతోంది. యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని...

Rana Daggubati: ఆ అవయువాలు దానం చేసి నా గురించి అడగండి:...

Rana Daggubati: ‘నా ఆరోగ్యం గురించి ఎవరికైనా అడగాలనుంటే ముందు మీ కన్ను, కిడ్నీ దానం చేసే ఆలోచన ఉంటేనే అడగండి.. లేదంటే అవసరం లేద’న్నారు...

రాజకీయం

జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్ పంచ్: నువ్వే నా పెళ్ళాం.! రా జగన్.!

అయిపోయింది.! ఈ మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో అనేయొచ్చు. కానీ, ఆగారు.. ఆలోచించారు.! చివరికి, అనేయక తప్పలేదు.! పవన్ కళ్యాణ్ అన్నారనడం కాదు, ఆ మాట అనిపించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్...

వాలంటీర్లనే నమ్ముకున్న వైసీపీ.! మునుగుతుందా.? తేలుతుందా.?

వాలంటీర్లతో దున్నేద్దాం.. ఈ మాట దాదాపు అందరు వైసీపీ నేతల నోటి నుంచీ వినిపిస్తోంది. ప్రజలతో వైసీపీకి అనుకూలంగా ఓట్లేయించే బాధ్యత పూర్తిగా వాలంటీర్లదేనని వైసీపీ నేతలు అంటున్నారు. ‘వైసీపీకి ఓటెయ్యించకపోయారో.. మీ...

జనసేనానికి ఉచిత సలహాలు.! ‘స్పేస్’లతో ప్రయోజనమేంటి.?

అప్పటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానులు.! కాదు కాదు, ఆ ముసుగులో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు బిల్డప్.! సమయం చూసి, వెన్నుపోటు పొడవడం.! ఒకప్పుడు చిరంజీవికి ఎదురైన పరిస్థితులే ఇప్పుడు...

మహిళా నేతని పరిగెత్తించి కొడతానన్న మంత్రి.! ఏపీ పోలీస్.. మీరెక్కడ.?

రాజకీయం మరీ ఇంతలా దిగజారిపోతుందా.? ఏ కాలంలో వున్నారు మీరంతా.? ఆల్రెడీ దిగజారిపోయింది. ఆడా లేదు, మగా లేదు.. సిగ్గు లేకుండా తిట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు. ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చి,...

అదేంటి బండ్ల గణేషా.. మంత్రి రోజా మీద అంత ‘నింద’ వేసేశావ్.?

డైమండ్ రాణి.. ఈ సెటైర్ తొలిసారిగా వేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ నేత, సినీ నటి, మంత్రి కూడా అయిన నగిరి ఎమ్మెల్యే రోజా మీద రాజకీయ విమర్శలో భాగంగా...

ఎక్కువ చదివినవి

అవమానాల్ని దాటుకుని.. జనసేన భవిష్యత్ ప్రయాణమెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే...

ఆ నాలుగు నియోజకవర్గాలు.! జనసైనికుల ఆవేదనలు.!

మహా సేన రాజేష్‌కి టీడీపీ నుంచి టిక్కెట్ దక్కినప్పుడు.. కళ్యాణ్ దిలీప్ సుంకరకి ఎందుకు టిక్కెట్ జనసేన నుంచి దక్కలేదు.? ఈ ప్రశ్న సోషల్ మీడియా వేదికగా జనసైనికుల నుంచి వస్తోంది. కొత్తపేట,...

Nani32 : ఆ తర్వాతే నాని, సుజీత్‌ మూవీ!

Nani32 : నేచురల్ స్టార్‌ నాని హీరోగా ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని ఈ ఏడాది...

Gautham Menon: ధృవ నక్షత్రం విషయంలో మనశ్శాంతి లేదు: గౌతమ్ మేనన్ విచారం

Gautham Menon: విక్రమ్ (Vikram) హీరోగా ప్రముఖ స్టార్ డైరక్టర్ గౌతమ్ మేనన్ (Gautham Menon) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ధృవ నక్షత్రం’ (Dhruva Nakshatram). 2016లోనే చిత్రీకరణ ప్రారంభించుకున్న సినిమా 2017లోనే...

PM Modi: వారణాసిలో ప్రధాని మోదీ తనిఖీలు..! కాన్వాయ్ ఆపి.. నడుస్తూ..

PM Modi: తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ (PM Modi) పర్యాటిస్తున్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి కాన్వాయ్ ఆపి మరీ.. నడుచుకుంటూ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయనతోపాటు...