NTR30: ఏ సినిమాకైనా స్టోరీ ఎంత ముఖ్యమో నటీనటులు కూడా అంతే ముఖ్యం. దర్శకుడు చెప్పిన సీన్ ని ఆయన అంచనాలకు తగ్గట్టు వారు నటించగలగాలి. నటనతో ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించడం కూడా వారి పనే. స్టోరీ బాగున్నా నటీనటుల అభినయ వైఫల్యం కారణంగా జనాదరణ నోచుకోని సినిమాలు ఎన్నో. అందుకే దర్శక నిర్మాతలు నటీనటుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తాము రాసుకున్న పాత్రలకు న్యాయం చేయదగ్గ నటులనే ఎంపిక చేసుకుంటుంటారు. అయితే ఈ విషయంలో టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva)ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్( Jr NTR)హీరోగా కొరటాల దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి నటీనటుల ఎంపిక విషయంలో ట్రోల్స్ కి గురవుతున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వి కపూర్( Jahnvi Kapoor)ని, ప్రతి నాయకుడిగా సైఫ్ అలీఖాన్( Saif Ali Khan) ని ఎంపిక చేశారు.అంతవరకు బాగానే ఉన్నా.. ఇతర తారాగణం ఎంపిక విషయంలో కొరటాల తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో సైఫ్ భార్య పాత్రకి సీరియల్ నటి చైత్ర రాయ్ ని ఎంపిక చేశారు. నిజానికి చైత్ర ఇప్పుడంత ఫామ్ లో లేదు. పెళ్లి చేసుకుని ఆడపిల్లకి జన్మనిచ్చాక కొన్నాళ్లు నటనకు విరామం ఇచ్చింది.
ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ఒకటి అర సీరియల్లో నటిస్తోంది ఇచ్చింది. అలాంటి ఆమెకు ఏకంగా ఎన్టీఆర్ సినిమాలోనే ఛాన్స్ ఇచ్చేశారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రకు మరో సీరియల్ నటి మణి చందనని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కొరటాల సెలక్షన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్ సినిమా అంటే సాధారణంగా అటు అభిమానుల్లో ఇటు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమా విషయంలో కొరటాల ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా తీస్తున్నారా? సీరియల్ తీస్తున్నారా? అంటూ సోషల్ మీడియా వేదికగా కొరటాలను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరి వీటన్నింటికి కొరటాల ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.