Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన కస్టడీ (Custody) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే.. ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు పరశురామ్ (Parasuram) తో సినిమా విషయం, వివాదంపై ఎదురైన ప్రశ్నకు కాస్త అసహనంతో సమాధానం చెప్పారు.
‘పరశురామ్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.. నా టైమ్ వేస్ట్ చేశారు’ అని సమాధానం ఇచ్చారు. దీంతో పరశురామ్ తో సినిమా ఇక లేనట్టే అని తెలుస్తోంది. నాగ చైతన్యతో నాగేశ్వర రావు అనే సినిమాను పరశురామ్ చేస్తారని వార్తలు వచ్చినా ప్రారంభం కాలేదు. పరశురామ్ మాత్రం మహేశ్ (Mahesh) తో సర్కారు వారి పాట సినిమా చేశారు.
కస్టడీ గురించి మాట్లాడుతూ.. ఈ కథ తనకెంతో నచ్చిందని తెలిపారు. సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. కస్టడీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు నాగ చైతన్య తెలిపారు.