Switch to English

మాజీ సీఎం మరదలు.. డాక్టరేట్ గ్రహీత.. అథ్లెట్..! నేడు ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

జీవితంలో ఉన్నత హోదా, గౌరవం, పేరు ప్రఖ్యాతులు దక్కినా.. విధిరాతకు మాత్రం తల వంచాల్సిందే. డాక్టరేట్, క్రీడా అథ్లెట్, ఉపాధ్యాయురాలు.. అంతకుమించి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పదేళ్లు పాలించిన అత్యంత సమీప బంధువు జీవితం ఎలా ఉంటుందో కనీసం ఆలోచించినా ఉన్నతంగానే ఉంటుంది. కానీ.. ఏమైందో ఏమో.. అంతటి విద్యావంతురాలు ప్రస్తుతం ఫుట్ పాత్ పై బిచ్చమెత్తుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య పదేళ్లు పని చేశారు. ఆయన భార్య మీరా తోడబుట్టిన సోదరే ఇరా బసు. ప్రస్తుతం ఆమె రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్ ప్రాంతంలోని దున్లాప్ లో ఫుట్ పాత్ పై మాసిన దుస్తులతో దుర్భర జీవితం గడుపుతున్నారు. ఐరా బసు వైరాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఆమె బెంగాలీతో పాటు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతారు. రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్, క్రికెట్లో ఆమె ఆడారు. 1976లో ప్రియానాధ్ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరి 2009లో పదవీ విరమణ పాందారు.

మాజీ సీఎం మరదలు.. డాక్టరేట్ గ్రహీత.. అథ్లెట్..! నేడు ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో..!!

ఆమె ఉపాధ్యాయురాలిగా ఉన్నప్పుడే బుద్ధదేవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో బరానగర్ లో నివసిస్తున్న ఐరా తర్వాత ఖర్దాలోని లిచూ బాగాన్ కు మారారు. అయితే.. పదవీ విరమణ అనంతరం ఏమైందో.. ఏమో..! ఆమె ఇప్పుడు ఫుట్ పాత్ పై నివసిస్తున్నారు. దీనిపై ప్రియానాధ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందిస్తూ.. ‘పదవి విరమణ అనంతరం ఫించన్ కోసం దరఖాస్తు చేసుకోమని కోరినా ఆమె చేసుకోలేదు. కారణాలు తెలీదు’ అన్నారు. అయితే.. మొన్నటి ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆమె విద్యార్ధులు, స్థానిక సంఘాల నాయకులు కొందరు ఆమెను సన్మానించారు.

‘నన్ను గుర్తు చేసుకుంటున్నవారికి ధన్యవాదాలు. ఇప్పటికీ నా విద్యార్ధులు నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నా పరిస్థితి చూసి జాలి పడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బుద్ధదేవ్ సీఎంగా ఉన్నప్పటి నుంచే నేను ఏ లబ్ది పొందలేదు. నాకు ఇప్పుడు తగిన గుర్తింపు ఇవ్వనవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఆమె పరిస్థితి తెలుసుకున్న అధికారులు.. ఆమెను కోల్ కతాకు తీసుకెళ్లారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించి ప్రభుత్వ సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మాజీ సీఎం మరదలు.. డాక్టరేట్ గ్రహీత.. అథ్లెట్..! నేడు ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో..!!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...