Switch to English

గోపీచంద్ సీటీమార్ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie సీటీమార్
Star Cast గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌
Director సంపత్‌ నంది
Producer శ్రీనివాసా చిట్టూరి
Music మ‌ణిశ‌ర్మ‌
Run Time 2 hr 18 Mins
Release సెప్టెంబర్ 10, 2021

గోపీచంద్ లీడ్ రోల్ లో నటించిన సీటిమార్ వినాయక చవితి స్పెషల్ గా విడుదలైంది. మరి ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? గోపీచంద్ కు తిరిగి హిట్ వస్తుందా లేదా అన్నది చూద్దాం.

కథ:

కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రప్రదేశ్ మహిళల కబడ్డీ జట్టుకి కోచ్ గా పనిచేస్తుంటాడు. తనకున్న లక్ష్యమల్లా ఈ టీమ్ ను నేషనల్ కబడ్డీ ఛాంపియన్ షిప్ లో గెలిచేలా చేయడమే. అయితే ఆ లక్ష్యానికి ఆ టీమ్ లో ప్లేయర్స్ అంతా కిడ్నప్ అవ్వడంతో చెల్లాచెదురవుతుంది. కిడ్నప్ చేసింది ఎవరు? దేనికోసం చేసారు? దీని వెనుక ఉన్నవారిని కార్తీక్ ఎలా బయటకు లాగాడు? చివరికి ఏమైంది అన్నది కథ.

నటీనటులు:

గోపీచంద్ కు మాస్ సీన్స్ కొట్టిన పిండి. కన్వెన్షనల్ మాస్ రోల్స్ తన బలం. సీటిమార్ సరిగ్గా ఇదే జోనర్ కు చెందింది కావడంతో గోపీచంద్ కు ఈ చిత్రం నల్లేరు మీద నడకే అయింది. తమన్నాకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే ఉన్నంతలో బానే చేసింది. జ్వాలా రెడ్డి సాంగ్ లో తమన్నా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్. విలన్ గా చేసినతను బాగానే చేసాడు. ఇక మహిళల కబడ్డీ టీమ్ లో ఆటగాళ్లుగా చేసిన వారందరూ కూడా చాలా బాగా చేసారు. దివ్యంగాన సెకండ్ లీడ్ రోల్ లో డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు:

సంపత్ నంది పాత కథనే తీసుకున్నా కానీ దానికి కబడ్డీ యాంగిల్ ను జోడించి సరికొత్త రూపును తీసుకొచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ గా సంపత్ నంది దీన్ని తీర్చిదిద్దాడు, ఆ విషయంలో ఈ సినిమా నిరాశపరచదు. ఫైట్ సీన్స్ తో, మాస్ ఎలివేషన్స్ తో ఈ సినిమాను ఒక ప్యాకేజ్ లా అందించాడు. ఈ టైపు సినిమాలు ఇష్టపడే వారికి కచ్చితంగా సీటిమార్ నచ్చుతుంది.

సినిమాటోగ్రఫీ హైలైట్ గా ఉంది. యాక్షన్ ఘట్టాల్లో, కబడ్డీ నేపథ్యంలో కెమెరా వర్క్ ప్రశంసనీయం. మణిశర్మ సాంగ్స్ కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా సినిమాకు పూర్తి న్యాయం చేసాడు. కొన్ని సన్నివేశాల్లో అదరగొట్టాడు. సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉంది. ఆ పార్ట్ ను ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

  • గోపీచంద్ పెర్ఫార్మన్స్
  • సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • జ్వాలా రెడ్డి సాంగ్

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్
  • రొటీన్ స్టోరీ అండ్ ట్రీట్మెంట్
  • స్క్రీన్ ప్లే

విశ్లేషణ:

స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను ప్రచారం చేసినా ఇది ఒక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కొంత కొత్తదనాన్ని తీసుకురావడానికి ఉపయోగపడింది అంతే. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఊర మాస్ ఎలివేషన్స్ తో లాజిక్స్ లేని పక్కా కమర్షియల్ చిత్రాలను ఎంజాయ్ చేసేవారికి నచ్చుతుంది. మొత్తంగా ఒకసారి చూడదగ్గ చిత్రంగా పేర్కొనవచ్చు.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.5/5 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ 5: సన్నీ, ప్రియాల మధ్య ముదురుతోన్న గొడవలు

నిన్నటి నామినేషన్స్ ఎఫెక్ట్ ఈరోజు కూడా బాగా నడిచింది. నామినేషన్స్ సందర్భంలో కావాలని సన్నీను టార్గెట్ చేయడానికి ప్రియా మైండ్ గేమ్ ఆడిన విషయం తెల్సిందే. చాలా సిల్లీ కారణం చెప్పి రవిని...

యాదాద్రి పునః ప్రారంభ ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు లక్ష్మి నరసింహ స్వామి వారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాదాద్రి పునః ప్రారంభ సమయం వచ్చేసింది. గత...

గన్ తో మంచు మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చి…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు ఫ్యామిలీ హల్చల్ బాగానే చేసింది. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా పోటీ చేసిన నేపథ్యంలో మంచు ఫ్యామిలీ, ప్రత్యర్థులకు బాగానే కౌంటర్ ఇచ్చారు. ఫైనల్...

పెట్రోల్‌ రేట్లకు నిరసనగా బస్సుకు నిప్పు పెట్టిన యువకుడు

దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ రేట్లకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన ఏడు కొండలు అనే 21 ఏళ్ల కుర్రాడు బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు....

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి

సుదీర్ఘ కాలంగా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పోలీసులు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా సుగర్‌ వ్యాది మరియు కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆయన చాలా కాలంగా తీవ్ర...