Switch to English

‘గ్యాంగ్ లీడర్’కు 30 ఏళ్లు..! ఇండస్ట్రీ రికార్డులను రఫ్ఫాడేసిన మెగాస్టార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి ప్రభ అప్రతిహతంగా వెలిగిపోతున్న దశలో వచ్చిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమాను చిరంజీవి కెరీర్లో ఓ ల్యాండ్ మార్క్ అనొచ్చు. ఫ్యాన్స్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒకేవిధంగా ఆకట్టుకున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్లో ప్రత్యేకం. అప్పట్లో 1987 నుంచి 1992 వరకూ వరుసగా ప్రతి ఏడాదీ ఓ ఇండస్ట్రీ హిట్ తో తెలుగు సినిమాపై తిరుగులేని ఆధిపత్యం సాధించారు చిరంజీవి. ఈక్రమంలోని సినిమానే ‘గ్యాంగ్ లీడర్’. చిరంజీవి కెరీర్ ను, క్రేజ్, ఇమేజ్ ను ఎవరెస్టు ఎత్తులో నిలిపిందీ సినిమా. ఈ సినిమా సాధించిన సంచలన విజయం చిరంజీవిని తిరుగులేని నెంబర్ వన్ హీరోగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసేసింది. 1991 మే 9న విడుదలైన ఈ సినిమా నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.

 

మాస్, ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, స్టయిల్, డైలాగ్ డిక్షన్, రఫ్ గెడ్డంతో లుక్స్,. ఫ్యాన్స్ కు పూనకాలే తెప్పించాయి. నలుగురు స్నేహితులకు లీడర్ గా, కుటుంబానికి దిక్కుగా.. చిరంజీవితో నట విశ్వరూపమే సినిమాలో కనిపిస్తుంది. దర్శకుడు విజయబాపినీడు సినిమా అద్భుతంగా రావడంలో తన దర్శకత్వ ప్రతిభ చూపించారు. మొదట బాపినీడు ఈ కథను చిరంజీవికి చెప్తే పెద్దగా నచ్చలేదు. ఈ విషయం తెలుసుకున్న పరుచూరి బ్రదర్స్ మార్పులు చేసారు. అదే కథను మళ్లీ చిరంజీవికి వినిపిస్తే అద్భుతం అని.. సినిమా చేద్దామన్నారట.

 

ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సృష్టించిన ప్రభంజనానికి ఆకాశమే హద్దు అయింది. బప్పీలహరి అందించిన సంగీతం మేజర్ హైలైట్. పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టే. పాటల్లో చిరంజీవి డ్యాన్సులకు ధియేటర్లలు దద్దరిల్లిపోయాయి. విజయశాంతితో వానా వానా వెల్లువాయే పాట ఓ క్లాసిక్. మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మాతగా శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించారు. అంతకుముందు ఏడాది జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో చిరంజీవే సృష్టించిన ఇండస్ట్రీ రికార్డును గ్యాంగ్ లీడర్ తుడిచిపెట్టేసింది. ‘రఫ్ఫాడించేస్తాను’ అనే చిరంజీవి మేనరిజమ్ పేలిపోయింది. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను ఒకేరోజు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు నగరాల్లో నిర్వహించడం విశేషం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...