Switch to English

రుణాల రద్దు: పెద్దలకో తీరు.. పేదలకో తీరు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మన సమాజంలో ఏ విషయమైనా డబ్బున్నవాళ్లకి ఒకలా.. డబ్బు లేని వాళ్లకు మరోలా జరుగుతాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండదు. దేవుడి దర్శనం దగ్గర నుంచి ప్రభుత్వం ప్రాపకం వరకు అన్నీ పెద్దలకు ఒకలా, పేదలకు మరోలా జరుగుతాయి. సాధారణ ప్రజల రుణాలను ముక్కు పిండి మరీ వసూలు చేసే బ్యాంకులు.. పెద్దల విషయానికి వచ్చేసరికి మాత్రం ఉదారంగా వ్యవహరిస్తాయి. వేల కోట్ల రుణాలను సింపుల్ గా రద్దు చేసేస్తాయి. ఇందుకు ప్రభుత్వాలు కూడా వత్తాసు పలుకుతాయి. అదే చిల్లిగవ్వ లేని పేదల రుణాలు రద్దు చేయాలంటే బోలెడన్ని నిబంధనలు గుర్తుకు వస్తాయి.

రైతులకు ప్రభుత్వం నుంచి ఏవైనా డబ్బులు వస్తే వాటిని బ్యాంకులు తమ అప్పు కింద మినహాయించుకుంటాయి. అదే పెద్దల విషయంలో మాత్రం అలాంటి సాహసం చేయవు. తాజాగా 50 మంది రుణ ఎగవేతదారులకు సంబంధించి రూ.68వేల కోట్లను బ్యాంకులు రద్దు చేశాయి. సాంకేతికంగా రైటాఫ్ అని చెప్పినప్పటికీ, ఇక ఆ రుణాలు వచ్చే అవకాశం ఉండదనేది దాని అర్థం.

ఇలా రుణాలు రైటాఫ్ అయినవారిలో నీరవ్ మోడీ కేసుతో సంబంధం ఉన్న మోహిల్ చోక్సీకి చెందిన మూడు కంపెనీలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం రూ.8వేల కోట్లు ఉన్నాయి. అలాగే రామ్ దేవ్ బాబాకు చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్ కు రూ.2,212 కోట్లు కూడా రైటాఫ్ అయ్యాయి.

ఇక విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు రూ.1943 కోట్లు రద్దయ్యాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్దలూ ఉన్నారు. డెక్కన్ క్రానికల్ అధినేత వెంకట్రామిరెడ్డి తీసుకున్న రూ.1915 కోట్లు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీ ట్రాన్స్ స్టాయ్ తీసుకున్న రూ.1790 కోట్లు, జగన్ కేసులో నిందితుడిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇందూ ప్రాజెక్ట్స్ కంపెనీ ద్వారా తీసుకున్న రూ.835 కోట్లు కూడా రైటాఫ్ అయిన రుణాల్లో ఉన్నాయి.

ప్రస్తుతం రుణాలు రద్దు అయినవారిలో దాదాపు అందరూ కూడా ఇప్పటికీ ఏటా వందలు, వేల కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నవారే. అయినా.. వారి రుణాలు రద్దయ్యాయి. పైగా మళ్లీ బ్యాంకులు అలాంటివారికే రుణాలు ఎడాపెడా ఇస్తాయి. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...