Switch to English

మల్టీస్టారర్స్ అంటే బాబోయ్ దేవుడా అంటున్నాడు

ఆరెక్స్ 100 వంటి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు దర్శకుడు అజయ్ భూపతి. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 30 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నిర్మాతలకు దాదాపు మూడింతల లాభాలు తీసుకొచ్చిన చిత్రమిది. అలాంటి సినిమాతో పరిచయమైన దర్శకుడికి రెండో సినిమాకు భారీ నిర్మాణ సంస్థలు అవకాశాల కోసం పోటీపడాలి. అయితే అలా జరగలేదు.

తన మొదటి సినిమా విడుదలై రెండేళ్లు కావోస్తోన్నా కానీ ఇంకా రెండో సినిమాను సెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు ఈ దర్శకుడు. దీనికి ఒకటే కారణముంది. తన రెండో సినిమాను ఒక మల్టీ స్టారర్ గా తెరకెక్కించాలనుకున్నాడు ఈ దర్శకుడు. ఏడాది పాటు కష్టపడి మహా సముద్రం అనే స్క్రిప్ట్ ను రాసుకున్నాడు.

ఈ సినిమాకు ఇద్దరు హీరోలు కావాలి. సరిగ్గా ఇక్కడ మొదలైంది మన దర్శకుడికి తిప్పలు. ఎంతో మంది హీరోలను తన స్క్రిప్ట్ పట్టుకుని కలిసాడు. రవితేజ దగ్గరనుండి మొదలుపెట్టి పదుల సంఖ్యలో యంగ్ హీరోలను ఈ సినిమా కోసం అనుకున్నాడు. అయితే ఎవరూ సెట్ కాలేదు. ఒక పాత్రకు శర్వానంద్ ముందుకొచ్చాడు. మరి రెండో పాత్ర సంగతి? నెలలు కావొస్తున్నా రెండో పాత్రకు ఇంకా ఎవరు సెట్ కాలేదు. కొన్ని రోజుల కిందట ఈ సినిమా కోసం సిద్ధార్థ్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇందులో నిజమెంతుందో మాత్రం తెలియదు.

అయితే ఈ సినిమా సెట్ చేసుకోవడానికి దర్శకుడు ఇబ్బందులు పడి చివరికి ఫ్రస్ట్రేట్ అయినట్టున్నాడు అందుకే తన కెరీర్ లో ఇదే మొదటి, చివరి మల్టీస్టారర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంటర్వ్యూలలో మంచి కథతో వస్తే ఏ హీరోతో అయినా మల్టీస్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే మన హీరోలు అసలు విషయంలోకి వచ్చేసరికి ఇలా ముఖం చాటేయడం ఏమాత్రం బాగోలేదు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: టిక్ టాక్ వీడియో కారణంగా గొర్రెల కాపరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో అటవీ శాక అధికారులు గొర్రెలు కాసుకునే నాగార్జునను అరెస్ట్ చేశారు. అతడు వన్య ప్రాణులను ఇబ్బంది పెడుతూ టిక్ టాక్ వీడియోను చేశాడు. పలు వీడియో లు సోషల్ మీడియాలో...

ఫ్లాష్ న్యూస్: తిరుపతి లడ్డూ 25 రూపాయలకేనట

తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ,...

ఫ్లాష్ న్యూస్: ఎయిడ్స్‌ని మించి భయపెడ్తున్న కరోనా వైరస్‌!

లైంగిక చర్యలు లేదా రక్త మార్పిడి ద్వారా వ్యాపించే ఎయిడ్స్‌ కూడా ‘వ్యభిచారాన్ని’ నిలువరించలేకపోయింది. ఎయిడ్స్‌కి కండోమ్ తో సమాధానమిచ్చి ‘వ్యభిచారం’ కొనసాగిస్తూ వస్తున్నారు. వ్యభిచారంపై ఎన్ని ఆంక్షలున్నా, అది చట్టవ్యతిరేకమైనా.. అది...

క్రైమ్ న్యూస్: కాటికెళ్లే వయసులో బాలికపై అత్యాచారం.!

బాలికలపై అత్యాచారాలను అరికట్టాలని ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇంకా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటువంటి ఓ దురాగతం సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పంచాయితీలోని కిష్టయ్యపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కుటుంబంతో కలిసి...

కరోనా అలర్ట్‌: ఇండియాలో లాక్‌డౌన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అంతేనా.?

‘ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నటించాయి.. ప్రజలు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నట్లు నటించారు..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై సెటైర్లు వేసుకునే సమయమా ఇది.?...