Switch to English

కనగరాజు నియామకం వెనుక మర్మమేంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

పలు అంశాల్లో కొరకరాని కొయ్యగా మారిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టు నుంచి అనూహ్యంగా తప్పించిన ఏపీ సర్కారు.. ఆ స్థానంలో తమిళనాడుకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును కొత్త ఎస్ఈసీగా నియమించింది. కరోనాతో అంతా అతలాకుతలమవుతున్న తరుణంలో ఇంత అనూహ్యంగా ఎస్ఈసీ మార్పులో ఆంతర్యం ఏమిటి?

పైగా రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆ పదవిలో ఎందుకు కూర్చోబెట్టారు అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. నిజానికి తమతో సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రమేశ్ కుమార్ పై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన నిర్ణయంపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే, వాయిదాని సమర్థించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని, మళ్లి ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

అనంతరం ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అన్న తరహాలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థుల చేత పంపిణీ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై చర్య తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్ఈసీకి లేఖ రాశారు. దీనిపై చర్యలు తప్పవని వైసీపీ నేతలతో అన్నట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే ఇక రమేశ్ విషయంలో జాప్యం చేయడం అనవసరమని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి ఆయన్ను తొలగించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే, కరోనా ఉధృతి సద్దుమణిగిన తర్వాత చర్యలు ఉంటాయని పలువురు భావించారు. కానీ సర్కారు అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది.

రమేశ్ తొలగింపు న్యాయస్థానాల్లో నిలబడుతుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే ప్రభుత్వం మాత్రం పక్కా వ్యూహంతోనే ముందుకెళ్లినట్టు తెలుస్తోంది. అటు రమేశ్ తొలగింపు, ఇటు జస్టిస్ కనగరాజు నియామకం అంతా ఆగమేఘాలపై జరిగిపోయింది. ఒకవేళ ఈ విషయంలో కోర్టుకు వెళ్లినా.. ఇప్పట్లో తెగే అవకాశం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈలోగా రమేశ్ పదవీకాలం ముగిసిపోతుందనేది సర్కారు భావనగా తెలుస్తోంది. మరి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...