Switch to English

టీడీపీలో మళ్ళీ ‘గంటా’ చక్రం తిప్పనున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

పార్టీ మారే ఆలోచనల్ని పక్కన పెట్టి, పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యోన్ముఖుడవుతున్నారట. కొన్నాళ్ళ క్రితం వైసీపీతో సంప్రదింపులు జరిపిన గంటా శ్రీనివాసరావు, మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డం పడ్డంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకున్న విషయం విదితమే. ఆ తర్వాత బీజేపీలో వెళ్ళేందుకూ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, చివరి నిమిషంలో గంటా శ్రీనివాసరావు తన ఆలోచనల్ని మార్చుకోవాల్సి వచ్చింది.

తాజాగా బీజేపీ నుంచి కొందరు కార్యకర్తల్ని టీడీపీలోకి లాక్కురాగలిగారు గంటా శ్రీనివాసరావు. అలా అధినేత చంద్రబాబు మెప్పుని పొందేందుకు గంటా శ్రీనివాసరావు వేసిన స్కెచ్‌ బాగానే పనిచేసినట్లుంది. గంటా శ్రీనివాసరావుకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేలా చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారట పార్టీ ముఖ్య నేతలతో. అయితే, దీన్ని మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో అచ్చెన్నాయుడు, టీడీపీలో అత్యంత కీలక నేతల్లో ఒకరిగా ఎదిగిన మాట వాస్తవం. ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడికి, పార్టీలో కీలక ప్రాధాన్యత కల్పిస్తున్నారు చంద్రబాబు. అయితే, గంటా తిరిగి యాక్టివ్‌ అయితే.. పార్టీలో గంటా వర్సెస్‌ అచ్చెన్నాయుడు.. వెరసి కొత్త ఆధిపత్య పోరు షురూ అవుతుందనే చర్చ పార్టీలోనే జరుగుతోంది.

అచ్చెన్నాయుడితో పోల్చితే గంటా శ్రీనివాసరావుకి ‘ఎక్స్‌ట్రా క్వాలిటీస్‌’ వున్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లోనూ గంటా శ్రీనివాసరావుకి సన్నిహిత సంబంధాలున్నాయి. పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మారుతున్న సమయంలో గంటా శ్రీనివాసరావు తనదైన స్టయిల్లో చక్రం తిప్పగలరు.. అది పార్టీకి కలిసొస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. మరి, అచ్చెన్నాయుడిని కాదని గంటాకి చంద్రబాబు కీలక పదవులు ఇవ్వడమా.? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం దొరకడంలేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...