Switch to English

ఏపీలో బీజేపీకి ‘డబుల్‌’ ట్రబుల్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

ఢిల్లీ బీజేపీ పెద్దలకు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో పెద్దగా సంబంధమేమీ లేనట్లే వుంది. ఎందుకంటే, కనీసం డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి లేదు మరి. 2014 ఎన్నికల్లో టీడీపీ పుణ్యమా అని బీజేపీకి ఓ రెండు ఎంపీ సీట్లు, నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కాయి.

2019 ఎన్నికల్లో మొత్తంగా సున్నా చుట్టేసిన విషయం విదితమే. ఇంత క్లియర్‌గా బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చాక.. భారతీయ జనతా పార్టీ అధిష్టానం, ఆంధ్రప్రదేశ్‌ గురించి ఎందుకు ‘ప్రత్యేకంగా’ ఆలోచిస్తుంది.? అయినాగానీ, ఏపీలో బీజేపీ నేతలు కొందరు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎదుగుతామని బీజేపీ చెబుతోంది. కానీ, ఎలా.?

ప్రస్తుతానికి జనసేన పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే, ఈ పొత్తు అతి త్వరలోనే బద్దలైపోయే సూచనలు కన్పిస్తున్నాయి. బీజేపీలో వైసీపీ అనుకూల, టీడీపీ అనుకూల వర్గాలున్నాయి. జనసేన అనుకూల వర్గాలు పెద్దగా కన్పించడంలేదు. బీజేపీలో వైసీపీ – టీడీపీ అనుకూల వర్గాల మధ్య రచ్చ రోజురోజుకీ ముదిరి పాకాన పడుతోంది.

వైసీపీ నేతలు కొందరు, బీజేపీ మీద మమకారం ప్రదర్శిస్తోంటే, అది బీజేపీలో వున్న టీడీపీ అనుకూల వర్గానికి నచ్చడంలేదు. పోనీ, టీడీపీని గట్టిగా వెనకేసుకొద్దామని బీజేపీలోని టీడీపీ అనుకూల వర్గం భావిస్తే, దానికి బీజేపీలోని వైసీపీ అనుకూల వర్గం కస్సుమంటోంది. ‘అసలు ఏ పార్టీ తరఫున అయినా మనమెందుకు వకాల్తా పుచ్చుకోవాలి.? మనకంటూ ఓ సిద్ధాంతం లేదా.?’ అని ఎప్పటినుంచో బీజేపీలో పాతుకుపోయిన కొందరు సీనియర్లు వాపోతున్నారు. అయితే, వారిని టీడీపీ – వైసీపీ అనుకూల వర్గం ఎప్పుడో తొక్కిపెట్టేసిందనుకోండి.. అది వేరే విషయం.

ఇదిలా వుంటే, ఎన్నార్సీ విషయంలో బీజేపీకి, వైసీపీ నుంచి సరికొత్త తలనొప్పి ఎదురయ్యింది. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు సంబంధించి వైసీపీ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో, బీజేపీలోని వైసీపీ అనుకూల వర్గం ఎలా స్పందించాలో తెలియక గింజుకుంటోంది.

అదే సమయంలో చంద్రబాబు సన్నిహితులపై ఐటీ దాడుల వ్యవహారం బీజేపీలోని టీడీపీ అనుకూల వర్గాన్ని సంకటంలోకి నెట్టేసింది. ఇంకోపక్క, బీజేపీ గనుక టీడీపీతోనో, వైసీపీతోనో కలిసి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు.. అదే జరిగితే, బీజేపీతో జనసేన మాత్రం వుండబోదని జనసేనాని హెచ్చరించడం సరికొత్త మలుపు. జనమేమో పార్టీని లెక్కచేయడంలేదు.. కానీ, పార్టీలోనే తగవులు తారాస్థాయికి చేరుతున్నాయి. మరి, ఈ పరిస్థితుల్లో బీజేపీ, ఏపీలో మనుగడ సాధించడం సాధ్యమేనా.?

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...