అవంతి శ్రీనివాస్.. అవంతి విద్యా సంస్థల కారణంగా ఆయన ఇంటి పేరు ‘అవంతి’ పేరుగా మారిపోయింది చాన్నాళ్ళ క్రితమే. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతల్లో ఈయనా ఒకరుగా చెలామణీ అవుతున్నారు.
చంద్రబాబు హయాంలో లోక్‌సభ సభ్యుడిగా అవంతి శ్రీనివాస్ పనిచేసిన విషయం విదితమే. అప్పట్లో అవంతి శ్రీనివాస్‌పై విశాఖలో భూముల కబ్జా ఆరోపణలు చాలానే వచ్చాయి. అలా ఆరోపణలు చేసిన వైఎస్సార్సీపీనే, ఇప్పుడాయన్ను ‘మిస్టర్ క్లీన్’గా అభివర్ణిస్తోందనుకోండి.. అది వేరే విషయం.
అప్పట్లో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన అవంతి శ్రీనివాసరావు కలిసి విశాఖను దోచుకున్నారన్నది ఇప్పటికీ విశాఖలో బలంగా విన్పించే ఓ విమర్శ. పైకి గట్టిగా అనలేకపోయినా, ఎప్పటినుంచో వైసీపీలో వున్న చాలామంది నేతలు ఇప్పటికీ అవంతిపై అదే భావనతో వున్నారనే చర్చ జరుగుతోంది. ఆ ‘మచ్చ’ చెరిపేసుకోవడానికీ, తాను జగన్ మనిషినని అన్పించుకోవడానికీ అవంతి పడే పాట్లు ప్రతిసారీ నవ్వులపాలైపోతున్నాయి.
చంద్రబాబు హయాంలో కేంద్రం సరిగ్గా రాష్ట్రానికి ఎందుకు నిధులు ఇవ్వలేదంటే, దానికి చంద్రబాబు అవినీతి, అప్పటి టీడీపీ నేతల దోపిడీయే కారణమని అవంతి మొన్నామధ్య ఓ సారి సెలవిచ్చారు.. తాజాగా ఇంకోసారీ సెలవిచ్చారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ‘అయ్యా అవంతీ.. అప్పటి టీడీపీ నేతలు దోచుకున్నారన్నదే నిజమైతే.. ఆ దోపిడీలో మీ వాటా ఎంత.?’ అంటూ సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు.
‘అబ్బే, నేను కడిగిన ముత్యాన్ని..’ అని అవంతి శ్రీనివాస్ చెప్పుకోవచ్చుగాక.. ఆయనెంత ‘నీతివంతుడో’ విశాఖ జిల్లా ప్రజానీకానికి బాగా తెలుసు. ‘టీడీపీని విమర్శించే క్రమంలో అవంతి శ్రీనివాస్ తనను తాను అవినీతి పరుడిగా ఒప్పేసుకుంటున్నారు..’ అంటూ అవంతిపై విశాఖ జనం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. కానీ, తప్పదు.. చంద్రబాబునో, పవన్ కళ్యాణ్‌నో గట్టిగా తిట్టకపోతే అవంతి శ్రీనివాస్ పరిస్థితి వైసీపీలో దయనీయంగా మారిపోతుంది మరి.!
475718 757313Some truly good and utilitarian details on this internet web site , likewise I feel the style and style holds fantastic attributes. 208882
158998 465781Wow ~ Excellent stuff ~ Come and check out MY ?? 408020
602482 36147Id always want to be update on new weblog posts on this internet site , bookmarked ! . 956402
446756 153259magnificent post, extremely informative. I wonder why the other specialists of this sector do not notice this. You need to continue your writing. Im confident, youve a great readers base already! 664354