Switch to English

ఆకాశంలో సగం కాదు.. పూర్తిగా వారే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మహిళలను ఆకాశంలో సగం అని అభివర్ణిస్తుంటారు. కానీ వారిప్పుడు ఆకాశంలో సగం కాదు.. ఆకాసమంతా వారే. భువి నుంచి దివి వరకు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు పురుషులు లేకుండా స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు. ఇలా మహిళలు మాత్రమే స్పేస్ వాక్ చేయడం తొలిసారి కావడం విశేషం.

నాసాకు చెందిన మహిళా వ్యోమగాములు క్రిస్టినా కోచ్, జెస్సికా మెయర్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చారు. అంతరిక్ష కేంద్రంలో పనిచేయని పవర్ కంట్రోలర్ బ్యాటరీని మార్చి తిరిగి లోనికి వెళ్లారు. మొత్తం ఏడు గంటల పదిహేడు నిమిషాలపాటు వీరిద్దరూ స్పేస్ వాక్ చేశారు.

గతంలోనూ మహిళా వ్యోమగాములు స్పేస్ వాక్ చేసినా.. అప్పుడు వారి వెంట పురుష వ్యోమగాములు ఉన్నారు. ఇప్పటివరకు 54 ఏళ్లలో మొత్తం 420 స్పేస్ వాక్ లు జరగగా.. 227 మంది పురుష వ్యోమగాములు, 14 మంది మహిళా వ్యోమగాములు అందులో పాలుపంచుకున్నారు. తాజాగా జరిగిన 421వ స్పేస్ వాక్ లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. క్రిస్టినా నాలుగోసారి స్పేస్ వాక్ చేయగా.. మెయర్ కు మాత్రం ఇదే తొలి స్పేస్ వాక్.

వాస్తవానికి ఆరు నెలల క్రితమే మహిళా వ్యోమగాముల స్పేస్ వాక్ జరగాల్సి ఉంది. అయితే, ఇద్దరికీ సరిపోయే స్పేస్ సూట్ అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. కాగా, మహిళా వ్యోమగాములు స్పేస్ వాక్ చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఫోన్ చేసి మాట్లాడారు. క్రిస్టినా, మెయర్ కు అభినందనలు తెలిపారు.

స్పేస్ వాక్ అంటే…

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేసే వ్యోమగాములు.. ఏవైనా మరమ్మతులు చేయడానికి, కొన్ని ప్రయోగాలు చేయాలనికి బయటకు రావాల్సి ఉంటుంది. అలా బయటకు వచ్చి పనిచేయడాన్ని స్పేస్ వాక్ అంటారు. ఎక్స్ ట్రా వెహికల్ యాక్టివిటీ (ఈవీఏ) అని కూడా దీనికి పేరుంది. గాలి, వాతావరణం లేని శూన్య ప్రదేశంలో నడవడం అంత సులభం కాదు. దానికి ఎంతో శిక్షణ అవసరం. స్పేస్ సూట్ ధరించి, అంతరిక్ష కేంద్రానికి.. సూట్ కి ఓ తాడు వంటి పరికరాన్ని అనుసంధానించుకుని బయటకు వస్తారు. ఆ శూన్య ప్రదేశంలో అవసరమైన చోటకు వెళ్లి తాము చేయాల్సిన పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత సవాల్ తో కూడిన పని. 1865 మార్చి 18న రష్యా వ్యోమగామి అలెక్స్ లెవనోవ్ తొలిసారిగా స్పేస్ వాక్ చేశారు. దాదాపు 10 నిమిషాలపాటు ఆయన ఆ వాక్ చేశారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...