Switch to English

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,439FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ పలు అనుమానాల్ని లేవనెత్తుతోంది.

ఈ విషయమై టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే, ఆ కంటెయినర్ కేవలం ‘ప్యాంట్రీ’ వాహనం అనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘మేం సిద్ధం’ బస్సు యాత్రకు సంబంధించి, భోజనావసరాలకు సంబంధించి ఈ ప్యాంట్రీ వాహనాన్ని రెడీ చేశారన్నది వైసీపీ వాదన.

కంటెయినర్.. ఈ మాట వింటే, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం ఉలిక్కి పడుతున్నారు. కారణం, 25 వేల కిలోల డ్రగ్స్ ఓ కంటెయినర్ ద్వారా బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకి చేరుకోవడమే. ఈ డ్రగ్స్ వ్యవహారంపై తొలుత ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. కానీ, అనూహ్యంగా ఆ రచ్చ చల్లారిపోయింది.

‘అందరూ దొంగలే.. అందరూ కలిసి పంచుకోవడానికి సిద్ధమైనట్టున్నారు.. అందుకే, అందరూ సైలెంటయిపోయారు..’ అన్న చర్చ, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ వేదికల వద్ద ప్రజల్లో జరుగుతోంది. ఈ సమయంలోనే, ముఖ్యమంత్రి ఇంట్లోకి కంటెయినర్.. అంశం తెరపైకొచ్చింది. దాంతో, సహజంగానే రాష్ట్రం ఉలిక్కిపడింది.

వాస్తవానికి అది కంటెయినర్ కాదు.. ఓ వ్యాన్. అది ప్యాంట్రీ వాహనంగా చెబుతూ వైసీపీ ఓ వీడియో కూడా విడుదల చేసింది. వీడియోలో అది ప్యాంట్రీ వాహనంగానే కనిపిస్తున్నప్పటికీ, అనుమానాలైతే అలాగే వున్నాయ్.

మూడు వేల కోట్ల రూపాయల నగదు, విలువైన వజ్రాలు, నగలు.. వీటన్నిటినీ కంటెయినర్‌గా చెప్పబడుతున్న సదరు ప్యాంట్రీ వాహనం ద్వారా మూడో కంటికి తెలియకుండా ఏదో పోర్టుకి తరలించారన్నది టీడీపీ ఆరోపణ. ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళిన ఆ వాహనానికి ‘పోలీస్ బోర్డ్’ పెట్టిన దరిమిలా, పోలీసు శాఖ ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇచ్చుకోవాల్సి వుంది.

ఇస్తుందా మరి.? పోలీసు శాఖ వివరణ ఇచ్చినాగానీ, ఈ వివాదం చల్లారుతుందా.? విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ తెరవకుండా వుండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రయత్నించారనీ, సీబీఐ ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిందనీ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...