Jr NTR: ఆస్కార్ వేడుక పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆయన కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. బ్లూ కలర్ సూట్ వేసుకున్న ఆయన తన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎన్టీఆర్ లుక్ స్టైలిష్ గా, సూపర్ గా ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డుల వేడుక రేపు లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనుంది.
మన దేశం తరఫున ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఆస్కార్ బరిలో దిగిన మిగతా పాటలు కూడా మంచి ఆదరణ కలిగి ఉండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.