Switch to English

చంద్రబాబు అప్పు.! వైఎస్ జగన్ అప్పు.! ఎవరిది తప్పు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

చంద్రబాబు అప్పులు చేసి రాష్ట్రాన్ని మంచేశారు.. వైఎస్ జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ.. నిత్యం చేస్తున్న ఆరోపణలివి. మిగిలిన రాజకీయ పార్టీలైన బీజేపీ, జనసేన కూడా, రాష్ట్రం మీద మోపబడుతున్న అప్పుల భారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం.

ఔను, చంద్రబాబు హయాంలో రికార్డు స్థాయిలో అప్పులు జరిగాయి. ఔను, ఆ రికార్డుని తిరగరాసింది వైఎస్ జగన్ సర్కారు.! కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవమిది. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే అప్పులు జరుగుతున్నాయని అప్పట్లో చంద్రబాబు అండ్ టీమ్ చెబితే, ఇప్పుడు వైఎస్ జగన్ అండ్ టీమ్ అదే మాట చెబుతోంది.

ఇక్కడ అసలు విషయమేంటంటే, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది. అంటే, ఇది తోడు దొంగల గూడు పుఠానీ.. అన్నుకోవాలన్నమాట. కేంద్రాన్ని రాష్ట్రాలు నిలదీయవు, రాష్ట్రాల్ని కేంద్రం గట్టిగా నిలదీయదు. ఇక్కడే, జనం నిండా మునిగిపోతున్నారు.

దేశం సంగతి పక్కన పెట్టి, రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించలేని స్థాయిలో అప్పులు జరుగుతున్నాయన్నది ఓ వాదన. ఓ టీడీపీ నేత, ఆర్థిక వ్యవహారాలపై ఒకింత అవగాహన వున్న ఓ యువ నాయకుడు, శ్రీలంకలో సగటున ప్రతి మనిషి మీదా వున్న అప్పు కంటే, దాదాపు రెండు రెట్లు అప్పు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వ్యక్తి మీదా వుందని చెబుతున్నారు.

ఇదే నిజమైతే, ఇంతకన్నా దారుణం ఇంకోటుండదు. అయినాగానీ, ‘అబ్బే, మేం చంద్రబాబు కంటే జాగ్రత్తగా అప్పులు చేస్తున్నాం.. చంద్రబాబు హయాంలో 19.4 శాతం, మా హయాంలో 15.77 శాతం.. అంటూ వైసీపీ సర్కారు చెబుతోంది. మరి, అప్పులెలా పెరుగుతున్నాయ్.? ఆ ప్రశ్నకైతే సమాధానం లేదు.

ప్రజలకు వాస్తవాలు చెప్పడం ప్రభుత్వాలెప్పుడో మానేశాయ్. ప్రజలకీ, ప్రభుత్వాల అప్పులతో పనిలేదు. అదే అసలు సమస్య. శ్రీలంక ఇప్పుడెదుర్కొంటున్న దుస్థితి తెలుగు రాష్ట్రాలకిగానీ, దేశానికిగానీ రాకూడదని దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏమీ చేయలేం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...

Bark Air: పెట్ డాగ్స్ ప్రయాణం కోసం ప్రత్యేక విమానం.. ‘బార్క్ ఎయిర్’

Bark Air: పెంపుడు కుక్కలను ప్రజా రవాణా వ్యవస్థలో తీసుకెళ్లనివ్వని సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి కోసమే 15కుక్కలు.. వాటితో ఒక్కో వ్యక్తి ప్రయాణించేలా ప్రత్యేక విమానం నడుపుతోంది ‘బార్క్ ఎయిర్’ (Bark...

నేడు ఏపీ లో తేలికపాటి వర్షాలు

బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏపీ తీరానికి దూరంగా ఈశాన్య దిశగా పయనిస్తూ గురువారం...

ఏపీ ఎలక్షన్స్: 10 వేల పైన మెజార్టీ 92 స్థానాల్లో.!

ఒకప్పుడు ఎన్నికలకు సంబంధించి ముందస్తు సర్వేలు నిర్వహించాలంటే, అదో పెద్ద తతంగం. ఇప్పుడు అంత సీన్ అవసరం లేదు. శాంపిల్స్ తీసుకోవడం చాలా తేలిక. ఎన్నికల ముందర అయినా, ఎన్నికల పోలింగ్ రోజున...

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...