Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కూడా పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
‘బెంగళూరు రేవ్ పార్టీ కాదు కదా.. వేసవి సెలవుల్లో ఉన్న నా పిల్లలకు చాక్లెట్ పార్టీ ఇచ్చేందుకు కూడా నాకు సమయం చిక్కట్లేదు. మరి.. ఇటువంటి వార్తలు ఎలా పుట్టిస్తారో అర్ధం కావడంలేదు. హైదరాబాద్ లో తీరికలేని పనులతో నేను బిజీగా ఉంటే ఎవరితోనే కనిపించానని పుకార్లు పుట్టిస్తున్నారు. జనసేనాని గురించి కూడా ఇష్టారీతన రాయడం తగనిది’.
‘నిన్న జరిగిన డైరక్టర్స్ డేలో కూడా పాల్గొన్నాను. ఆసుపత్రిలో ఉన్న నా స్నేహితుడిని కలవడానికి వెళ్లి మా అసోసియేషన్లోనే ఉన్న నేను ఎక్కడో ఎలా కనిపించానో వార్త రాసినవాళ్లకే తెలియాలి. అందరం చేసుకునే పార్టీ జూన్ 4. జై జనసేన’ అంటూ వీడియోలో పేర్కొన్నారు.
హైదారాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.
నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని… pic.twitter.com/iCTccquFkN
— Jani Master (@AlwaysJani) May 20, 2024