Switch to English

బాలకృష్ణ పొలిటికల్‌ ‘యాక్షన్‌’.. అసలు కథ ఇదీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

సినిమాల్లో నందమూరి బాలకృష్ణ డైలాగులు అదుర్స్‌.. కానీ, అదే బాలకృష్ణ రాజకీయ ప్రసంగాలు చేస్తే మాత్రం అభిమానులు బెదుర్సే. అయితే, ఇది రైట్‌ టైమ్‌.. బాలకృష్ణ తనను తాను మార్చుకోవాల్సిన సందర్భమొచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన బాలకృష్ణ, నియోజకవర్గ సమస్యల మీదనే కాదు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ గళం విప్పాల్సిన సందర్భం వచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 మంది సభ్యులే వున్న దరిమిలా, అందులో బాలకృష్ణ పాత్ర చాలా కీలకంగా మారింది. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. బాలకృష్ణకి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పిస్తున్నారట, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు మీద. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ఎంత అవసరమో, పార్టీలో ప్రతి ఒక్కరూ అదే స్థాయిలో సమర్థత చాటుకోవాల్సి వుంది.

మామూలుగా అయితే, చంద్రబాబు ఎవర్నీ నమ్మరు. కానీ, ఇప్పుడు నమ్మాల్సిందే. సో, ప్రతి ఒక్కర్నీ తన సొంత మనుషుల్లా చూసుకుంటున్న చంద్రబాబు, సొంత మనిషి అయిన బావమరిది బాలకృష్ణ విషయంలో ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. తాజాగా, బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగంలో అమరావతి ప్రస్తావన ఎక్కడుందంటూ నిలదీశారు. బాలకృష్ణలోని ఈ ఆవేశం మీడియా ప్రతినిథుల్నీ ఆశ్చర్యపరిచింది.

బాలకృష్ణ రాజకీయాల్లో ముందు ముందు మరింత అగ్రెసివ్‌గా మారితే, తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టడానికి పెద్దగా సమయం కూడా పట్టదనీ, అది తెలుగుదేశం పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని మీడియా వర్గాలు సైతం చర్చించుకోవడం కనిపించింది. ‘గతంలో మేం అధికార పక్షంలో వున్నాం.. అందుకే, నేను ఎక్కువగా రాజకీయాల్లో కల్పించుకోవడానికి అవకాశం రాలేదు. ఇప్పుడు పార్టీ బాధ్యతల్ని పంచుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇకపై దబిడ దిబిడే’ అని సన్నిహితుల వద్ద బాలకృష్ణ వ్యాఖ్యానించారట.

బాలకృష్ణ రాజకీయాల్లో యాక్టివ్‌ అవుతారని తాము ఊహించలేదనీ, చంద్రబాబు ఆయనకు అవకాశం ఇస్తారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామనీ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైసీపీ నేత తనకు అత్యంత సన్నిహితుడైన మీడియా ప్రతినిథి ఒకరి వద్ద అభిప్రాయపడ్డారట. ఏదిఏమైనా, నిన్ననే తన కొత్త సినిమాని ప్రారంభించిన బాలకృష్ణ, ఈ రోజు అసెంబ్లీలో అసలు సిసలు రాజకీయం షురూ చేసేశారు. దాంతో నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...