Switch to English

సినిమా రివ్యూ: గేమ్ ఓవర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

నటీనటులు : తాప్సి, వినోదిని, అనీష్ కురివిల్లా, సంచితా, రమ్య, పార్వతి తదితరులు ..
దర్శకత్వం : అశ్విన్ శరవణన్
నిర్మాత : ఎస్ శశికాంత్
సంగీతం : రోన్ ఏతాన్ యోహాన్
ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్
కేమెరా : ఏ వసంత్

దక్షిణాదిలో హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సి ఇక్కడ సరైన సక్సెస్ అందకపోవడంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ భిన్నమైన సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి ఇమేజ్ అందుకున్న తాప్సి .. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లోకూడా ఆపకుండా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిన తెలుగును మాత్రం మరచిపోనని చెప్పిన తాప్సి తాజాగా గేమ్ ఓవర్ అంటూ ఓ సరికొత్త ప్రయత్నం చేసింది. ఇప్పటివరకు రానటువంటి కథనంతో తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. మరి ఈ గేమ్ ఓవర్ గురించి తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

స్వప్న ( తాప్సి ) ఓ వీడియొ గేమ్ డిజైనర్. ఆమెకు గేమ్స్ ఆడడమంటే చాలా ఆసక్తి. అనుకోకుండా స్వప్న జీవితంలో ఓ సంఘటన జరుగుతుంది. అప్పటినుండి స్వప్న కు చీకటంటే భయం పుట్టుకొస్తుంది. తల్లి దండ్రులకు దూరంగా ఓ పనిమనిషి ని పెట్టుకుని నగరంలోని ఓ ఇంట్లో ఉంటుంది. అయితే స్వప్న తన చేతికి వేసుకున్న ఓ పచ్చబొట్టు వేయించుకుంటుంది. ఆ పచ్చబొట్టు రంగులో అమృత ( సంచిత ) అస్తికలు కలవడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అసలు ఆ పచ్చబొట్టు వేయించుకున్నాక స్వప్న లైఫ్ పై ఎలాంటి ప్రభావం చూపించింది. ఇంతకీ చనిపోయిన అమృతకు స్వప్నకు సంబంధం ఏమిటి ? లాంటి విషయాలే మిగతా కథ ..

నటినటుల ప్రతిభ :

ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా చెప్పాలంటే .. తాప్సి తన భుజాలపై ఈ కథను నడిపించింది. కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది కాబట్టి తాప్సి నటన హైలెట్ గా సాగింది. నిజంగా ఈ సినిమాతో తాప్సి నటనలో మరో మెట్టు ఎక్కిందని చెప్పొచ్చు. పరిణితి నిండిన పాత్రలో తాప్సి హావభావాలు హైలెట్ గా నిలుస్తాయి. ఇక పనిమనిషి పాత్రలో వినోదిని చక్కగా చేసింది. ఇక అమృత అనే అమ్మాయి పాత్రలో సంచిత ఆకట్టుకుంది. మిగతా పాత్రలు ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేసాయి. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు కథనం చాలా ముఖ్యం కాబట్టి దర్శకుడు కథనాన్ని చేలా బిగువుగా నడిపించాడు. ఐతే కొన్ని సన్నివేశాల్లో సాగతీత ఎక్కువగా కనిపించింది.

టెక్నీకల్ హైలెట్స్ :

సాంకేతికంగా సినిమా బాగుంటుంది. అద్భుతమైన కథ , కథనం మెప్పిస్తుంది. రోన్ అందించిన సంగీతం .. రీ రికార్డింగ్ బాగుంది. ఇక ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు అశ్విన్ గురించి చెప్పాలంటే .. ఇదివరకే మాయ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు మరోసారి తన సత్తా చాటాడు. కథ నిడివి వంద నిమిషాలే అయినప్పటికీ కథనం ఆకట్టుకునేలా సాగింది. ఆత్మ కథతో పాటు సీరియల్ కిల్లర్స్ నేపధ్యాన్ని దానికి మానసిక పరమైన సంఘటనలను చక్కగా అల్లుకున్నాడు దర్శకుడు. ఇలాంటి థ్రిల్లర్స్ విషయంలో నెక్స్ట్ ఏమి జరుగుతుంది అన్న విషయం ప్రేక్షకుడికి ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. అది ఊహకందని విధంగా మలిచి సూపర్ అనిపించుకున్నాడు. అనూహ్య మలుపులు, ఊహించని సంఘటనలు ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. వీడియొ గేమ్ నేపథ్యంలో సాగిన కథను కూడా అచ్చంగా అలాగే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు.

విశ్లేషణ :

విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కిన గేమ్ ఓవర్ .. వీడియొ గేమ్ తరహాలోనే సాగింది. థ్రిల్లర్ కథల విషయంలో ఎలాంటి బిగువు ఉండాలో అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. అయితే కొన్ని సన్నివేశాలు ఆసక్తి కలిగించవు. అమృత ను చంపిన కిల్లర్ స్వప్న దగ్గరికి ఎలా వచ్చాడు? స్వప్నకు ఇవన్నీ ముందుగానే ఎలా కలల్లోకి వస్తాయి అన్న విషయాలు సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. అసలు సైకో కిల్లర్ ఎవరు ? ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు ? అన్న విషయాన్నీ చెప్పకపోవడం పెద్ద లోటు? ఇక మిగతా విషయాలు పరిశీలిస్తే .. తాప్సి నటన, దర్శకుడు మేకింగ్ , టెక్నీకల్ హైలెట్స్ అంశాలుగా ఉన్నాయి. మొత్తానికి ఓ కొత్త తరహాకథను థ్రిల్లర్స్ అంటే ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చే సినిమా ఇది.

ట్యాగ్ లైన్ : ఆట పూర్తికాలేదు

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏప్రిల్ 5న విడుదల...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...