మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా పలు మీడియా లో రెగ్యులర్ గా చిరంజీవి రాజకీయాలతో సంబంధాలను కలిగి ఉన్నాడని.. బిజెపిలోకి చిరంజీవి జాయిన్ అవ్వబోతున్నాడు అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న చిరంజీవికి నరేంద్ర మోడీ ఆహ్వానం తో మళ్ళీ రాజకీయ చర్చ మొదలైంది. రాజ్యసభ సభ్యత్వంను చిరంజీవికి ఆఫర్ చేశారని, కానీ చిరంజీవి మాత్రం ఆసక్తిగా లేరని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
తాజాగా మళ్లీ రాజకీయాలకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కాని రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ట్విట్టర్ లో ఒక వాయిస్ మెసేజ్ ని షేర్ చేశాడు. ఈ వ్యాఖ్యలను పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. రాజకీయం తన నుండి దూరం కాలేదు అన్నాడు కనుక కచ్చితంగా ఆయన రాజకీయాలకు దూరంగా పోలేదు అంటున్నారు. మరో వైపు ఇది గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ స్టాటజీ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.