Switch to English

క్రికెట్ కు ఓ వీరుడి గుడ్ బై

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఓవైపు ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరుగుతుండగా.. మరోవైపు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. సరైన ఆటతీరు లేకపోవడంతో రెండేళ్లుగా జట్టుకు దూరమైన యువీ.. తాజాగా తనకు ఎంతో ప్రాణపదమైన ఆట నుంచి తప్పుకుంటున్నట్టు భావోద్వేగంతో ప్రకటించాడు. సోమవారం ముంబైలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.

19 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు చూశానని.. జీవితంలో ఎలా ఉండాలో క్రికెటే తనకు నేర్పిందని భావోద్వేగానికి గురయ్యాడు. క్రికెట్ లో తను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు ధన్యవాదాలు చెప్పాడు. ఇక తన లక్ష్యం కేన్సర్ బాధితులకు సాయం అందించడమేనని పేర్కొన్నాడు. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసిన యువీ.. 2012లో ఇండ్లండ్ పై చవరి టెస్ట్, 2017లో వెస్టిండీస్ తో చివరి వన్డే, 2017లోనే ఇంగ్లండ్ పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.

ధోని సారథ్యంలో భారత్ గెలుచుకున్న రెండు ప్రపంచకప్ టోర్నీల్లోనూ యువరాజ్ ముఖ్యభూమిక పోషించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ప్రపంచకప్ టోర్నీల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ యూవీదే. ముఖ్యంగా తనకు ప్రాణాంతక క్యాన్సర్‌ ఉందని తెలిసినా ఆటకే ప్రాధాన్యత ఇచ్చిన యువీ.. ప్రపంచకప్ ఆడి అటు బ్యాట్ తోనూ ఇటు బంతితోనూ మెరిసి భారత జట్టుకు కప్ సాధించి పెట్టాడు. కెరీర్లో మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువీ 3 సెంచరీలు, 11 అర్థ సెంచరీలతో 1900 పరుగులు చేశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు, 52 అర్థ సెంచరీలతో 8,701 పరుగులు.. 58 టీ20 మ్యాచ్‌ ల్లో 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.

అతడో శిఖరం..

భారత క్రికెట్ జట్టుకు సంబంధించి యువీ నిస్సందేహంగా ఓ శిఖరమే. సొగసైన అతడి ఆటతీరు, ఉరకలెత్తే ఉత్సాహం అతడికి ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. చాలా సింపుల్ గా సిక్సర్లు కొట్టే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్.. బంతితో కూడా మ్యాజిక్ చేయగల సమర్థుడు. అంతేకాకుండా ఫీల్డింగ్ లో కూ చాలా చురుకుగా ఉంటూ టీమిండియా బెస్ట్ ఆల్ రౌండర్ గా రాణించాడు.

2007 టీ20 ప్రపంచ కప్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్ ను ఉతికి ఆరేసిన తీరును అభిమానులు ఎప్పటికీ మరచిపోరు. ఇక కేన్సర్ ఉందన్న విషయం తనకు తెలిసినా, 2011 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొని ఆట కోసమే పరితపించాడు. ఆ టోర్నీలో బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ కూడా రాణించి భారత జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించడంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. అలా ప్రపంచకప్ ముగిసిందో లేదో.. తనకు ప్రాణాంతక కేన్సర్ వ్యాధి ఉన్న విషయాన్ని బయటపెట్టి అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాడు.

అయితే, ఆటలో ఎలా గెలిచానో, జీవితంలోనూ గెలుస్తానని, మళ్లీ వచ్చి బ్యాట్ పట్టుకుంటానని చెప్పి అమెరికా వెళ్లాడు. చెప్పినట్టుగానే మహమ్మారి కేన్సర్ ను జయించి, తిరిగి వచ్చి పట్టుదలతో మళ్లీ జట్టులో చోటు సంపాదించాడు. అయితే, ఆ తర్వాత ఆటపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో 2017లో జట్టుకు దూరయ్యాడు. 2019లో జరిగిన ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పటికీ, అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...