Switch to English

కొడాలి నాని పంచన చేరనున్న దేవినేని ఉమ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రకంపనలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టించేందుకే కంకణం కట్టుకున్నట్లు కన్పిస్తోంది తాజా పరిస్థితులు చూస్తోంటే. తాజా ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ నుంచి ఎంపీగా గెలిచినా, కొన్ని చోట్ల ఆయన్ను ఓడించేందుకు సాక్షాత్తూ టీడీపీ నేతలే పనిచేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్క కేశినేని నాని పరిస్థితి మాత్రమే కాదు, చాలామంది పరిస్థితి ఇదే. గ్రూపు తగాదాల కారణంగానే తెలుగుదేశం పార్టీకి ఇటీవలి ఎన్నికల్లో ఇంతటి దుస్థితి వచ్చింది. శ్రీకాకుళం నుంచి, చిత్తూరు దాకా.. దాదాపు అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ, తెలుగుదేశం పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువగా ‘సొంత అసమ్మతి’ దెబ్బకొట్టిందని సర్వేలు సైతం తేల్చి చెబుతున్నాయి. ఇక, కేశినేని నాని పరిస్థితి మరీ ప్రత్యేకం.

మంత్రిగా చంద్రబాబు క్యాబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు, అడుగడుగునా కేశినేని నానిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారట. ఈ క్రమంలో దేవినేని ఉమా చావు దెబ్బ తిన్నారనుకోండి.. అది వేరే విషయం. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన కేశినేని నాని విజయం సాధించారు. మరోపక్క, ‘కొడాలి నాని, దేవినేని ఉమకు రుణపడి వుండాలి’ అంటూ కేశినేని నాని సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంటే, గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ని ఓడించేందుకు స్వయానా దేవినేని ఉమ పనిచేశారనుకోవాలి.

ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు దేవినేని ఉమకి కొత్తేమీ కాదు. మరోపక్క, కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో మరోసారి సత్తా చాటారు. కొడాలి నాని తప్ప, గుడివాడ నియోజకవర్గానికి ఇంకో నాయకుడు లేనట్లుగా ఆయన తన సత్తా చాటుతూ వస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పట్ల వున్న విధేయత, నియోజకవర్గంపై పట్టు, జిల్లా రాజకీయాలపైనా ఆయనకున్న అవగాహన.. ఇలా అన్నీ లెక్కలేసుకుని, వైఎస్‌ జగన్‌ తన మంత్రి వర్గంలో కొడాలి నానికి అవకాశం కల్పించారు. అలా కొడాలికి మంత్రి పదవి దక్కడంపై దేవినేని ఉమ సంబరపడుతున్నారా? రేపో మాపో ఆయన టీడీపీని వీడి, వైసీపీలో చేరిపోతారా? కేశినేని నాని వ్యాఖ్యలు చూస్తోంటే అదే నిజమనిపిస్తోంది.

Related Posts

చంద్రబాబుని తిడితే లాభమేంటి మోడీజీ!

టీడీపీలో కేశినేని తిరుగుబాటు ఆరంభం మాత్రమేనా?!

లోకేష్‌.. మీకిది తగునా?!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...