Switch to English

పార్టీ పేరు రగడ: వైఎస్సార్సీపీకి నోటీసులు.!

ఇకపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనీ, వైఎస్సార్సీపీ అనీ పిలవడానికి వీల్లేదా.? ఏమో, ముందు ముందు ఆ పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా అయితే ఇప్పటిదాకా అందరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని పిలిచినా, వైఎస్సార్సీపీ అని పిలిచినా, వైసీపీ అని పిలిచినా.. అది జగన్‌ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ గురించే. కానీ, ఇక్కడ ఇంకో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వుంది. అదే, అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

ఇప్పుడు ఈ ‘అన్న వైఎస్సార్సీపీ’ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది తమ పార్టీ పేరులోని ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ వాడేస్తోందని ఆరోపిస్తూ. ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకీ అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. నిజానికి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ కూడా శివకుమార్‌ అనే వ్యక్తి పెట్టింది. ఆ శివకుమార్‌ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని తీసుకున్నారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. శివకుమార్‌కి పార్టీలో ‘నామ్ కే వాస్తే’ తరహా పదవి ఇచ్చిన, ఆయన్ని మీడియా నుంచీ, రాజకీయాల నుంచీ దూరంగా వుంచారు.

ఇప్పుడు ‘పేరు’ గొడవ కారణంగా ఆ శివకుమార్‌ న్యాయస్థానం ముందుకు రావడం తప్పకపోవచ్చు. అన్నట్టు, అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించింది కడప జిల్లాకి చెందిన బాషా. ఈయన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సూచన మేరకే తాను అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని పెట్టానని బాషా చెబుతున్నారు. గతంలోకూడా కేంద్ర ఎన్నికల సంఘం ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరు వాడకూదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని ఆదేశించిందని భాషా చెబుతుండడం గమనార్హం.

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి షోకాజ్ నోటీస్‌ వెళ్ళడంతో ఈ ‘పేరు’ గొడవ మొదలైంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ పేరు విషయమై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రఘురామకృష్ణరాజు స్పష్టత తెచ్చుకున్న విషయం విదితమే. రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌లో ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’ అని పేర్కొనకుండా, ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అని పేర్కొనడమే ఈ వివాదానికి కారణం. మరి, ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో ఏమో.!

సినిమా

ఎక్స్ క్లూజివ్: జాతీయ అవార్డు గ్రహీతతో రాజశేఖర్‌ మూవీ

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన మాత్రం వరుసగా స్క్రిప్ట్‌లు వింటున్నాడు. ఇప్పటికే...

సుశాంత్‌ డెత్‌ మిస్టరీ: ఈ కేసులో న్యాయం జరుగుతుందా.?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి నానా యాగీ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ముంబై - బీహార్‌...

క్లాసిక్ సీక్వెల్ లో కీర్తి సురేష్ ఫైనల్ అయినట్లేనా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు....

రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

సుశాంత్‌ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కోరుకున్నట్లుగా జరిగింది. ఆయన మృతికి కారణం రియా అయ్యి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మృతికి సంబంధించిన కేసును సీబీఐకి...

సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ రియా విమర్శలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మళ్ళీ స్పందించింది. రీసెంట్ గా...

రాజకీయం

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం అంగీకరించడంతో ఆమె పదవీకాలం మరో మూడు నెలల పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే...

‘బడి పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది’ కొత్త విద్యావిధానంపై ప్రధాని మోదీ

నూతన విద్యా విధానంకు సంబంధించి 30ఏళ్ల తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నూతన...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...

మోడీ ఆలోచనలు.. పవన్ నాయకత్వం.. అదిరిందయ్యా వీర్రాజూ!

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే వీరాభిమానం. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఈ రోజు జనసేన అధినేతను హైద్రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సోము...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ.. మూడు నెలల గడువులో..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని ఆమధ్య సీఎం జగన్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు ప్రభుత్వం...

ఎక్కువ చదివినవి

సుశాంత్‌ డబ్బుతో వారు పార్టీ చేసుకునే వారు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు కేవలం డిప్రెషన్‌ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అనుకున్న అభిమానులు మెల్ల మెల్లగా పలువురిపై...

టిబి స్పెషల్: లాల్ కృష్ణుడి నుంచి నరేంద్రుడి వరకు..

అసలు బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదం ఏమిటి? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? చివరకు ఎలా కొలిక్కి వచ్చింది? ఓసారి చూద్దాం.. త్రేతాయుగంలో అంటే దాదాపు 9 లక్షల సంవత్సరాల క్రితం శ్రీరాముడు...

కరోనా నుండి కోలుకున్నా ఆత్మహత్య చేసుకున్నారు

కరోనా కొన్ని లక్షల జీవితాలను చిద్రం చేస్తోంది. చాలా మంది కరోనాతో మరణిస్తూ ఉంటే మరి కొందరు కరోనా భయంతో మరణిస్తూ ఉన్నారు. ఇంకా కొందరు కరోనా వల్ల వచ్చిన ఆర్థిక కష్టాలను...

ఏపీలో ప్రత్యేకాధికారుల పాలన పొడిగింపు.. ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే..!

రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేట్టు లేవు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈమేరకు...

టీపీసీసీ చీఫ్‌కు మోకాలి గాయం

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అయిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మోకాలి గాయంతో ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్లుగా పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేయడం జరిగింది. కారణం ఏంటో తెలియదు...