Switch to English

నిండా ముంచేసిన ముద్రగడ.. తెరవెనుక వున్నదెవరు.?

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదు. నిజానికి, కాపు సామాజిక వర్గం కొత్తగా రిజర్వేషన్లు కోరడంలేదు. చాలా ఏళ్ళ క్రితం తమకున్న బీసీ-రిజర్వేషన్‌ని తిరిగి పునరుద్ధరించాలని మాత్రమే కోరుతోంది. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గం పేరుతో ఎంతోమంది రాజకీయంగా ఎదిగారు. కాపు సామాజిక వర్గం తరఫున ఎవరు నిజాయితీగా నిలబడినా, వాళ్ళందర్నీ తొక్కేశారు కూడా.!

ఇక, ఇటీవలి కాలంలో కాపు ఉద్యమం విషయానికొస్తే, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరుని ప్రముఖంగా చెప్పుకోవాలి. కాపు ఉద్యమం పేరు చెప్పి ఆయన పొందిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమం పేరుతో ముద్రగడ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఇంతా చేసి, ముద్రగడ ఏమన్నా సాధించారా.? అంటే అదీ లేదు.

ఇప్పుడేమో, కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటన విడుదల చేశారు. అందుక్కారణాలు చెబుతూ, చాలామంది కాపు నేతలు తనపై నిందారోపణలు చేస్తున్నారని వాపోయారు. నాయకుడన్నవాడెవడైనా ఎవరో ఆరోపణలు చేస్తే ఉద్యమం నుంచి తప్పుకుంటాడా.? నవ్విపోదురుగాక మనకేటి.. అన్నట్టుంది ఇప్పుడు ఈ వ్యవహారం. చంద్రబాబు హయాంలో ‘కాపు ఉద్యమం’ పేరుతో ‘అలజడి’ సృష్టించి, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో ఉద్యమాన్ని వదిలేస్తున్నట్లు ముద్రగడ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

సహజంగానే టీడీపీ అనుకూల మీడియా, ‘ఇదంతా వైసీపీ కుట్ర..’ అని ఆరోపిస్తుంది. దానికి వైసీపీ నుంచి ఎలాగూ కౌంటర్‌ ఎటాక్‌ వుంటుందనుకోండి.. అది వేరే విషయం. కానీ, ఇక్కడ ముద్రగడ ‘వాక్‌ ఔట్‌’ వెనుక రాజకీయం సుస్పష్టం. కాపు సామాజిక వర్గంలో మరోమారు చీలిక తెచ్చేందుకోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి, కాపు రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన సందర్భమిది.

ఎవరి బెదిరింపులకో, ఎవరి ప్రలోభాలకో లొంగిపోయి ముద్రగడ, ఈ ‘వాక్‌ ఔట్‌’ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం, ఆవేదన కాపు సామాజిక వర్గం నుంచి సోషల్‌ మీడియా వేదికగా వెల్లువెత్తుతోంది. ‘కాపు జాతి’ అంటూ ఎలుగెత్తి చాటిన ముద్రగడ, ఇప్పుడు ఆ జాతికి తీవ్ర ద్రోహం చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న దరిమిలా, ఆయన ఎవరి ప్రలోభాలతో ఇదంతా చేస్తున్నారన్న విమర్శలకు ఆయన్నుంచి స్పష్టమైన సమాధానమొస్తుందా.?

నిండా ముంచేసిన ముద్రగడ.. తెరవెనుక వున్నదెవరు.?

సినిమా

ఎక్స్ క్లూజివ్: జాతీయ అవార్డు గ్రహీతతో రాజశేఖర్‌ మూవీ

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన మాత్రం వరుసగా స్క్రిప్ట్‌లు వింటున్నాడు. ఇప్పటికే...

సుశాంత్‌ డెత్‌ మిస్టరీ: ఈ కేసులో న్యాయం జరుగుతుందా.?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి నానా యాగీ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ముంబై - బీహార్‌...

క్లాసిక్ సీక్వెల్ లో కీర్తి సురేష్ ఫైనల్ అయినట్లేనా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు....

రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

సుశాంత్‌ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కోరుకున్నట్లుగా జరిగింది. ఆయన మృతికి కారణం రియా అయ్యి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మృతికి సంబంధించిన కేసును సీబీఐకి...

సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ రియా విమర్శలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మళ్ళీ స్పందించింది. రీసెంట్ గా...

రాజకీయం

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం అంగీకరించడంతో ఆమె పదవీకాలం మరో మూడు నెలల పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే...

‘బడి పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది’ కొత్త విద్యావిధానంపై ప్రధాని మోదీ

నూతన విద్యా విధానంకు సంబంధించి 30ఏళ్ల తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నూతన...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...

మోడీ ఆలోచనలు.. పవన్ నాయకత్వం.. అదిరిందయ్యా వీర్రాజూ!

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే వీరాభిమానం. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఈ రోజు జనసేన అధినేతను హైద్రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సోము...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ.. మూడు నెలల గడువులో..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని ఆమధ్య సీఎం జగన్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు ప్రభుత్వం...

ఎక్కువ చదివినవి

జగన్‌కి గుడి కట్టడమేంటి.? హిందువుడిగా ఖండిస్తున్నానన్న రఘురామ!

‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఓ ఎమ్మెల్యే గుడి కట్టడమేంటి.? వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద సదరు ఎమ్మెల్యేకి మరీ అంత భక్తి ఎక్కువైపోతే, ఎంచక్కా చర్చిని నిర్మించుకోవచ్చు..’ అంటూ పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో...

సుశాంత్ సూసైడ్ లో కొత్త ట్విస్ట్.. అకౌంట్ నుంచి 15 కోట్లు మాయం..

సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. విచారిస్తున్న కొద్దీ పోలీసులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే.. ముంబై పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్న సుశాంత్...

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో ప్రభాస్.. సెల్ఫీలతో అభిమానుల సందడి

బహిరంగ ప్రదేశాల్లో సినీ ప్రముఖులు ఎవరు కనిపించినా ప్రజలకు ఆశ్చర్యమే. పెద్ద పెద్ద తెరలపై చూసేవారిని ప్రత్యక్షంగా చూస్తే ఆ అనుభూతి వేరుగానే ఉంటుంది. అందులోనూ చిన్న చిన్న పాత్రలు చేసే నటులు...

ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ కొనసాగేనా.? రద్దయ్యేనా.?

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కొన్ని ఏకగ్రీవాలు జరిగాయి.. ఇంతలోనే కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ ప్రారంభమయ్యింది. పరిస్థితి తీవ్రతను ముందుగా అంచనా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌...

సన్ ఫార్మా నుంచి కరోనా మందు విడుదల.. ట్యాబ్లెట్ రూ.35 కే..

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఔషధం వచ్చిందంటే అంతకంటే గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అడుగులు పడుతున్నాయి....